Wednesday, November 16, 2016

ఆర్ధిక సంక్షోభం రాబోతుందని చెప్పిన వార్త రుజువైనది

2016 జనవరి 29న సింహరాశిలోనికి రాహువు ప్రవేశించాడు. అప్పటికే అక్కడ గురు గ్రహ సంచారం ఉన్నది. ఈ రెండు గ్రహాల సంచారాన్ని గురు చండాల యోగంగా భావిస్తారు. ఆ తర్వాత 2016 జూన్ 24న రాహువు, గురువు ఒకే బిందువులోనికి రావటంచే గురువుకు రాహువు  చేత నాగబంధనం ఏర్పడింది. ఇదే సమయంలోనే వైరి గ్రహాలైన కుజుడు, శని ఒకేచోట కలవటం కూడా తటస్థించింది. అంటే శని కుజుల సంఘర్షణ, నాగబంధనం జరిగాయన్నమాట.

వచ్చే సంవత్సరం మర్చి నెలలో వజ్రోత్సవాలు జరుపుకోబోతున్న ఐరోపా సమాఖ్య (ఈ.యూ) కు అక్షరాలా నాగ బంధన ప్రభావం శరాఘాతంగా గుచ్చుకుంది. అగ్రరాజ్యమైన అమెరికా కు ధీటుగా, ఆర్ధిక వ్యవస్థగా ప్రసిద్ధికెక్కిన, 28 దేశాల ఐరోపా సమాఖ్య నుంచి యునైటెడ్ కింగ్డమ్ వైదొలగటం జూన్ 24నే జరిగింది. ఇది చరిత్రలో తొలిసారి. నాలుగు దశాబ్దాల పై చిలుకు అనుబంధం చెదిరిపోయింది.

బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం వలన ఎదురయ్యే ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకునేందుకు భారతదేశం సంపూర్ణంగా సిద్ధంగా ఉంది అని అమిత్ షా పైకి చెప్పినప్పటికీ, రాబోతున్న ఆర్ధిక సంక్షోభాన్ని మాత్రం ఎదుర్కొంటాం కష్టమవుతుందని, దీని కారణంగా భారత దేశంలో వివిధ రాష్ట్రాలపైనా రాజకీయ అస్థిరతలు చోటుచేసుకొని ఆర్ధిక సంక్షోభాన్ని నాగబంధనం ప్రారంభించునని, తద్వారా భారతదేశంలో నిత్యావసరాలు విపరీతంగా పెరుగునని చాప క్రింద నీరులా సమస్యలు చుట్టుకొనునని 2016 జూన్ 23, 24 తేదీలలోనే పత్రికా ముఖంగా కూడా తెలియచేస్తూ నా ఫేస్బుక్ లో ఉంచటం జరిగింది.

అంతేకాక  గతంలో 1984లో శని, కుజుల సంఘర్షణ ఏర్పడినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ అంగరక్షకులచే హతమార్చబడినదని, భోపాల్ లో గ్యాస్ లీకేజీ, పంజాబ్ గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ జరిగినవి. అదే శని కుజుల సంఘర్షణ ఇప్పుడు  జరగటం దీని ప్రభావం మరియు, నాగ బంధన ప్రభావం భారతదేశ ఆర్ధిక స్థితిని చిన్నాభిన్నం చేయును.

కనుకనే పైన చెప్పిన వ్యతిరేక గ్రహస్థితులు ప్రభావం 2017 మధ్యవరకు ఉండును. కనుక ప్రజలందరూ ఈ వ్యతిరేక గ్రహసంచారా స్థితుల నుంచి బయట పడటానికి, రాబోతున్న వ్యతిరేక స్థితుల నుంచి కూడా ఉపశమనం  పొందటానికి తదుపరి పోస్టింగ్లను పరిశీలించేది. - దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.