Saturday, April 4, 2015

సంపూర్ణ చంద్రగ్రహణం - కన్యారాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

శ్రీ మన్మధ నామ సంవత్సర చైత్రపూర్ణిమ నాటి సంపూర్ణ చంద్రగ్రహణం కన్యారాశిలో హస్తా నక్షత్రంలో రాహుగ్రస్తంగా సంభవిస్తున్నది. కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడు కూడా ఈ సమయానికి ఖగోళంలో నీచ స్థితిలో ఉండటమే కాక వక్రమార్గంలో ప్రయాణం చేయటం గమనార్హం. అర్ధం ఏమిటంటే ఈ రాశికి అధిపతి ఈ సమయంలో ప్రతికూల స్థితిలో ఉన్నాడని భావము. అంతేకాకుండా కన్యారాశి అంటే ప్రకృతి సంబంధిత రాశి అని అర్థము. హస్తా నక్షత్రం గణపతి యొక్క జన్మ నక్షత్రం. పృధ్వీ తత్వంగా భాసిల్లే మూలాధార చక్రానికి అధిపతే గణపతి. అంటే ప్రతి వ్యక్తి చేసే క్రియా కలాపాలన్నింటికీ మూలాధారంగా ఉండే అంశం ఏదైతే ఉంటుందో.... ఆ అంశం కొంత వ్యతిరిక్త భావంతో ఉంటుందని భావించాలి.

ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం కన్యారాశి వారిపైన జూలై 31 వరకు ఉంటుంది. కనుక కన్యారాశి వారు తాము ఆలోచించే ప్రతి విషయం పైన సరియైన శ్రద్ధ పెట్టాలి. ఏదో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకున్నాము అని కాకుండా, తీసుకున్న నిర్ణయము ఎంతవరకు సహేతుకమో కాదో ఆలోచించాలి. ఎందుకంటే ఆ సమయానికి ఆ నిర్ణయము కొంత ఆనందాన్ని అందించినదిగా ఉన్నప్పటికీ... భవిష్య రోజులలో కూడా ఇలాంటి సంతోషమే ఇచ్చేదిగా ఉంటుందా లేదా అనే అంశం పైన అధిక దృష్టి ఉంచాలి. ఒక్కొక్కసారి తన మనసుకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా భవిష్య స్థితి విషయంలో పూర్తి అనుకూలతలు ఉంటాయి అని ప్రస్తుతం తీసుకుందే నిర్ణయం పూర్తిగా వ్యతిరేకంగా ఉండకూడదు. బుద్ది బలంతోను, మనోబలంతోను ఆలోచిస్తూ మానసిక, శారీరిక సంఘర్షణలకు గురి కాకుండా సర్వం అనుకూలమయం అవుతుందనే ప్రగాఢ విశ్వాసం కూడా ఉంచి భక్తి విస్వాశాలతో తాము నమ్మిన దేవతను ఆరాధిస్తూ, విశేష స్థితులను కోరుకునే విధంగా ఉంటూ పావులు కదుపుతూ వెళ్ళాలి.

జూలై 31 వరకు తమ నిర్ణయాలు అనుకూలంగా వెళ్ళేలా అవకాశాలు వస్తూ వుంటాయి. వచ్చిన అవకాశాలను చేజార్చుకోకుండా, ఒడిసి పట్టుకొని లబ్దితో పాటు అధిక ప్రయోజనాలు పూర్తి స్థాయిలో తనకు మాత్రమే లభించాలి... ఇంకెవరికీ ఉండకూడదు అనే స్వార్ధం లేకుండా ముందుకు వెళ్ళాలి. కేవలం శరీరంలో మనస్సు ఒక భాగమే కానీ శరీర సంఘర్షణ వేరు, మానసిక సంఘర్షణ వేరు. ఈ రెండు సంఘర్షణలు ఇప్పుడు తారాస్థాయిలో ఒక దానితో ఒకటి సంఘర్షితమై తెలియని స్థితి ఏర్పడే అవకాశం ఉంది. కనుక కన్యా రాశి ప్రకృతి సిద్ధం కాబట్టి, ప్రకృతి ధర్మాలను పొందేలా ఉండాలి.

ఇక్కడ ప్రకృతిని గురించి ఒక మాట చెప్పుకోవాలి. గులాబీలు, సుగంధము, మంచి వాతావరణము, ఆహ్లాద భరిత మనోభావాలు ఇవన్నీ ప్రకృతి అందించేవే. అదే ప్రకృతి భీకర తుఫానులూ, సునామీలు, భూకంపాలు మొదలైనవి కూడా ఇస్తుంటుంది. మరి ప్రకృతిని ఆరాధించటమంటే.... అనుకూలంగా చెప్పిన ప్రకృతి ఆరాధన లేక ప్రతికూలంగా చెప్పిన ప్రకృతి ఆరాధన ? అనే అనుమానం రావచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాశిలో గ్రహణం ఉంది గనుక మనో, శరీరాలు రెండూను బలవంతంగానైనా  అనుకూల ప్రకృతివైపు మొగ్గు చూపేలా తమ తమ నిర్ణయాలని మార్చుకుంటూ ఉండాలి.

ఏతా వాతా చెప్పేదేమిటంటే మనసును ముఖ్య విషయంపై కేంద్రీకరించి సముచితమైన అంతరంగాన్ని ఆవిష్కరించేలా ఉండాలి. అంతేతప్ప గడబిడ వాతావరణంలోకి వెళ్లి కకావిలంగా మనసుని పాడుచేసుకొని ఆనందానికి దూరం కావద్దు. ప్రకృతి చాలా గొప్పది. అలాంటి ప్రకృతిని అనుకూలంగా మలుచుకోవటానికి మాత్రమే ప్రయత్నించండి. కలహాలపైనా, క్రోధాలపైనా, స్వార్దాలపైనా మనసుని పెట్టవద్దు. సంఘర్షణ పూరిత వ్యవహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఎదుటివారు చెప్పింది పూర్తిగా ఆకళింపు చేసుకొని ఆపైన నిర్ణయాలను చెప్పండి. మీ నిర్ణయమే తుది తీర్పు అయినప్పటికీ వినటంలో తప్పులేదు కదా ! మొత్తం మీద మీదే పైచేయిగా ఉండాలి అంటే మనస్సుకు కారకుడైన చంద్రుడికి సంపూర్ణ గ్రహణం అనేది బుద్ది కారకుడైన బుధుని యొక్క ఇంట్లో పడుతున్నది. కనుక మనస్సు, బుద్ది ఈ రెండూ రెండు ధ్రువాలు. ఈ రెండు ధ్రువాలు ఒకటిగా ఉండేలా ప్రయత్నించండి. పూర్తి స్థితిని కైవసం చేసుకొనే రీతిలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ క్రింది తేదిలలో కూడా మనో బుద్ధులను ఏకం చేయండి.

కన్యారాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :
ఏప్రిల్ 18 సాయంత్రం 5.23 నుంచి 20 సాయంత్రం 6.57 వరకు
మే 15 అర్ధరాత్రి తదుపరి 2.42 నుంచి 18 ఉదయం 4.55 వరకు
జూన్ 12 ఉదయం 9.40 నుంచి 14 మధ్యాహ్నం 1.06 వరకు
జూలై 9 మధ్యాహ్నము 3.08 నుంచి 11 రాత్రి 7.20 వరకు ప్రతికూల సమయాలని భావించాలి.

వీటితో పాటు ఉత్తర 2,3,4 జాతకులు :
ఏప్రిల్ 9 ఉదయం 6.52 నుంచి 10 ఉదయం 7.30  వరకు,
ఏప్రిల్ 17 రాత్రి 7.49 నుంచి 18 సాయంత్రం 5.23 వరకు,
ఏప్రిల్ 26 మధ్యాహ్నం 3.54 నుంచి 27 సాయంత్రం 6.38 వరకు,
మే 6 మధ్యాహ్నం 12.41 నుంచి 7 మధ్యాహ్నం 1.04 వరకు,
మే 15 ఉదయం 4.35 నుంచి అర్థరాత్రి తదుపరి 5.42 వరకు,
మే 23 రాత్రి 12.03 నుంచి 24 అర్థరాత్రి తదుపరి 2.28 వరకు,
జూన్ 2 రాత్రి 7.51 నుంచి 3 రాత్రి 7.50 వరకు,
జూన్ 11 ఉదయం 10.59 నుంచి 12 ఉదయం 9.40  వరకు,
జూన్ 20 ఉదయం 8.31 నుంచి 21 ఉదయం 10.41 వరకు,
జూన్ 30 ఉదయం 4.31 నుంచి జూలై 1 ఉదయం 4.19 వరకు,
జూలై 8 సాయంత్రం 4.20 నుంచి 9 మధ్యాహ్నం 3.08 వరకు,
జూలై 17 సాయంత్రం 4.25 నుంచి 18 సాయంత్రం 6.32 వరకు,
జూలై 27 మధ్యాహ్నం 1.51 నుంచి 28 మధ్యాహ్నం 1.52 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

హస్తా నక్షత్ర జాతకులు :
ఏప్రిల్ 10 ఉదయం 7.30 నుంచి 11 ఉదయం 7.36  వరకు,
ఏప్రిల్ 18 సాయంత్రం 5.23 నుంచి 19 మధ్యాహ్నం 3.09 వరకు,
ఏప్రిల్  27 సాయంత్రం 6.38 నుంచి 28 రాత్రి 9.40 వరకు,
మే 7 మధ్యాహ్నం 1.04 నుంచి 8 మధ్యాహ్నం 1.03 వరకు,
మే 15 అర్థరాత్రి తదుపరి 5.42 నుంచి 16 అర్థరాత్రి 12.53 వరకు,
మే 24 అర్థరాత్రి తదుపరి 2.28 నుంచి 26 ఉదయం 5.20 వరకు,
జూన్ 3 రాత్రి 7.50 నుంచి 4 రాత్రి 7.22 వరకు,
జూన్ 12 ఉదయం 9.40 నుంచి 13 ఉదయం 8.26  వరకు,
జూన్ 21 ఉదయం 10.41 నుంచి 22 మధ్యాహ్నం 1.22 వరకు,
జూలై 1 ఉదయం 4.19 నుంచి అర్థరాత్రి తదుపరి 3.31  వరకు,
జూలై 9 మధ్యాహ్నం 3.08 నుంచి 10 మధ్యాహ్నం 2.09 వరకు,
జూలై 18 సాయంత్రం 6.32 నుంచి 19 రాత్రి 9.07 వరకు,
జూలై 28 మధ్యాహ్నం 1.52 నుంచి 29 మధ్యాహ్నం 1.09 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

చిత్ర 1,2 పాద జాతకులు :
ఏప్రిల్ 11 ఉదయం 7.36 నుంచి 12 ఉదయం 7.11 వరకు,
ఏప్రిల్ 19 మధ్యాహ్నం 3.09 నుంచి 20 మధ్యాహ్నం 1.18 వరకు,
ఏప్రిల్  28 రాత్రి 9.40 నుంచి 29 రాత్రి 12.47 వరకు,
మే 8 మధ్యాహ్నం 1.03 నుంచి 9 మధ్యాహ్నం 12.40 వరకు,
మే 16 అర్థరాత్రి 12.53 నుంచి 17 రాత్రి 11.15 వరకు,
మే 26 ఉదయం 5.20 నుంచి 27 ఉదయం 8.25 వరకు,
జూన్ 4 రాత్రి 7.22 నుంచి 5 సాయంత్రం 6.34 వరకు,
జూన్ 13 ఉదయం 8.26 నుంచి 14 ఉదయం 7.20 వరకు,
జూన్ 22 మధ్యాహ్నం 1.22 నుంచి 23 సాయంత్రం 4.22 వరకు,
జూలై 1 అర్థరాత్రి తదుపరి 3.31 నుంచి 2 అర్థరాత్రి 2.15 వరకు,
జూలై 10 మధ్యాహ్నం 2.09 నుంచి 11 మధ్యాహ్నం 1.27 వరకు,
జూలై 19 రాత్రి 9.07 నుంచి 20 రాత్రి 12.03 వరకు,
జూలై 29 మధ్యాహ్నం 1.09 నుంచి 30 మధ్యాహ్నం 11.46 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి కన్యారాశి జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.

తదుపరి పోస్టింగ్ లో తులారాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.