Thursday, April 2, 2015

సంపూర్ణ చంద్రగ్రహణం -కర్కాటకరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

శ్రీ మన్మధ చైత్ర పూర్ణిమ నాటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం వలన కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు 2015 జూలై 31 వరకు కేవలం సోదర, సోదరీ సంబంధ అంశాలలోనే ముఖ్య జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది మినహా ఏ ఇతర అంశాలలోనూ గ్రహణ ప్రభావం ఏమీ ఉండదని గ్రహించాలి. సోదర సోదరీ  అంశాలలో ప్రభావం ఎలా ఉంటుందంటే..... అనుకోకుండా డబ్బు ఇచ్చి పుచ్చు కోవటాలలో తేడాలు వచ్చి, ఒకరినొకరు అనుకోకుండా మాటా మాటా పెంచుకొనే స్థితిలోకి వెళ్ళే అవకాశాలు ఉంటుంటాయి. లేదా ఆస్తి సంబంధిత విషయాలలో కానీ, అన్నదమ్ముల లేక అక్క చెల్లెళ్ళ గృహ సరిహద్దు విషయాలలో కానీ లేదా తండ్రి ఇచ్చిన ఆస్తులలో వాటా పంపకాలలో కానీ తేడాలు ఉన్ననూ, లేకున్ననూ.... అనుకోకుండా వీరి మధ్య కొంత శత్రుత్వాన్ని పెంచుకుంటుంటారు. మరికొన్ని సందర్భాలలో వృద్దులుగా ఉన్న తల్లి తండ్రుల ఆలనా పాలనా చూడటానికై  అన్నదమ్ములు ఒకరినొకరు ఓ అంగీకారానికి రాకుండా, వారి తల్లి తండ్రుల స్థితి గతులను ఒక సోదరుడే చూడాలని... రెండవ వ్యక్తి కొన్ని కారణాలు చెప్తూ వాదిస్తారు. లేదా ఓ సోదరుడు తన ఇల్లు చిన్నదని పైగా కుమార్తె గర్భవతిగా ఇంట్లో ఉన్నదని, ఇలాంటి సమయంలో వృద్దులుగా ఉన్న తల్లి తండ్రులను తీసుకొని వచ్చి తన ఇంట్లో ఉంచుకోవటం కష్ట సాధ్యమని, ఏదైనా సమస్య వస్తే అందుబాటులో ఎలాంటి సౌకర్యాలు తన ఇంటికి దరి దాపులలో ఉండవని, కనుక రెండవ సోదరుడే వీరిని ఉంచుకొనేట్లయితే... తన వంతుగా, తన శక్తికి తగినట్లుగా కొంత సొమ్మును ఇస్తానని చెప్పి సోదరుడితో వాపోతాడు. కానీ సోదరుడు కొంతవరకు విన్నప్పటికీ, సోదరుని భార్య ఏదో ఒక పేచి పెట్టినందువల్ల కూడా సమస్య జటిలమయ్యే అవకాశాలు ఉంటుంటాయి.

కాబట్టి ఇలాంటి అంశాలు చెప్పుకుంటూ పోతే అనేకమనేకం ఉంటుంటాయి. ఇలాంటి విషయాలలో ముందుగా సోదరుల మధ్య లేక సోదరీల మధ్య ఓ సరైన అవగాహన ఉండాలి. కనుక ఇది గమనించి పునర్వసు నక్షత్ర చివరి పాదం వారు, పుష్యమి, ఆశ్లేష జాతకులు కింద చూపిన సమయాలలో అనవసరమైన కలహాలకు గాని, బంధు ద్వేషాలకు గాని వెళ్ళకూడదు. ఒకవేళ ఇరువురి మధ్య ఓ అవగాహన వచ్చినప్పటికీ, ఆ ఒప్పందము వ్రాత పూర్వకంగా ఉండటమే ఎంతైనా సముచితము.

కర్కాటక రాశిలోనే గురు, శుక్ర శుభగ్రహాలు జూలై 1 వ తేదిన కలవటం జరుగుతుంది. కనుక ఈ దర్శనీయమైన శుభగ్రహాలను, ఈ రాశి జాతకులు తప్పకుండా దర్శించుకొనవలసిన అవసరం ఉంది. ఇలా దర్శించినందువలన మానసికంగా, శారీరకంగా స్థిరత్వాన్ని పొందిన వారగుదురు.

కర్కాటకరాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :
ఏప్రిల్ 14 మధ్యాహ్నం 3.51 నుంచి 16 సాయంత్రం 4.55  వరకు
మే 11 రాత్రి 10.17 నుంచి 13 రాత్రి 12.50 వరకు
జూన్ 7 అర్ధరాత్రి 3.41 నుంచి 10 ఉదయం 6.40 వరకు
జూలై 5 ఉదయం 10.01 నుంచి 7 మధ్యాహ్నం 12.10 వరకు ప్రతికూల సమయాలని భావించాలి.

వీటితో పాటు పునర్వసు 4 వ పాద జాతకులు :
ఏప్రిల్ 13 ఉదయం 6.13 నుంచి 14 ఉదయం 4.47 వరకు,
ఏప్రిల్ 21 మధ్యాహ్నం 11.57 నుంచి 22 మధ్యాహ్నం 11.15 వరకు,
ఏప్రిల్ 30 అర్ధరాత్రి తదుపరి 3.46 నుంచి మే 2 ఉదయం 6.28 వరకు,
మే 10 మధ్యాహ్నం 11.57 నుంచి 11 ఉదయం 10.56 వరకు,
మే 18 రాత్రి 9.56 నుంచి 19 రాత్రి 9.04 వరకు,
మే 28 మధ్యాహ్నం 11.27 నుంచి 29 మధ్యాహ్నం 2.13 వరకు,
జూన్ 6 సాయంత్రం 5.32 నుంచి 7 సాయంత్రం 4.20 వరకు,
జూన్ 15 ఉదయం 6.27 నుంచి 16 ఉదయం 5.52 వరకు,
జూన్ 24 రాత్రి 7.28 నుంచి 25 రాత్రి 10.24 వరకు,
జూలై 3 రాత్రి 12.41 నుంచి 4 రాత్రి 10.56 వరకు,
జూలై 12 మధ్యాహ్నం 1.00 నుంచి 13 మధ్యాహ్నం 12.53 వరకు,
జూలై 21 అర్ధరాత్రి తదుపరి 3.11 నుంచి 23 ఉదయం 6.17 వరకు,
జూలై 31 ఉదయం 9.54 నుంచి అర్ధరాత్రి 12.00 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

పుష్యమి జాతకులు :
ఏప్రిల్ 4 అర్ధరాత్రి 11.36 నుంచి 5 అర్ధరాత్రి తదుపరి 2.02 వరకు,
ఏప్రిల్ 14 ఉదయం 4.47 నుంచి అర్ధరాత్రి తదుపరి 2.55 వరకు,
ఏప్రిల్ 22 మధ్యాహ్నం 11.15 నుంచి 23 మధ్యాహ్నం 11.17 వరకు,
మే 2 ఉదయం 6.28 నుంచి 3 ఉదయం 8.44 వరకు,
మే 11 ఉదయం 10.56 నుంచి 12 ఉదయం 9.39 వరకు,
మే 19 రాత్రి 9.04 నుంచి 20 రాత్రి 8.46 వరకు,
మే  29 మధ్యాహ్నం 2.13 నుంచి 30 సాయంత్రం 4.31 వరకు,
జూన్ 7 సాయంత్రం 4.20 నుంచి 8 మధ్యాహ్నం 3.02 వరకు,
జూన్ 16 ఉదయం 5.52 నుంచి 17 ఉదయం 5.41 వరకు,
జూన్ 25 రాత్రి 10.24 నుంచి 26 రాత్రి 12.55 వరకు,
జూలై 4 రాత్రి 10.56 నుంచి 5 రాత్రి 9.07 వరకు,
జూలై 13 మధ్యాహ్నం 12.53 నుంచి 14 మధ్యాహ్నం 1.06 వరకు,
జూలై  23 ఉదయం 6.17 నుంచి 24 ఉదయం 9.06 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ఆశ్లేష జాతకులు :
ఏప్రిల్ 5 అర్ధరాత్రి తదుపరి 2.02 నుంచి 7 ఉదయం 4.05 వరకు,
ఏప్రిల్ 14 అర్ధరాత్రి తదుపరి 2.55 నుంచి 15 రాత్రి 12.44 వరకు,
ఏప్రిల్ 23 మధ్యాహ్నం 11.17 నుంచి 24 మధ్యాహ్నం 12.0 వరకు,
మే 3 ఉదయం 8.44 నుంచి 4 ఉదయం 10.32 వరకు,
మే 12 ఉదయం 9.39 నుంచి 13 ఉదయం 8.07 వరకు,
మే 20 రాత్రి 8.46 నుంచి 21 రాత్రి 9.08 వరకు,
మే 30 సాయంత్రం 4.31 నుంచి 31 సాయంత్రం 6.14 వరకు,
జూన్ 8 మధ్యాహ్నం 3.02 నుంచి 9 మధ్యాహ్నం 1.41 వరకు,
జూన్ 17 ఉదయం 5.41 నుంచి 18 ఉదయం 6.02 వరకు,
జూన్ 26 రాత్రి 12.55 నుంచి 27 అర్థరాత్రి తదుపరి 2.50 వరకు,
జూలై 5 రాత్రి 9.07 నుంచి 6 రాత్రి 7.22 వరకు,
జూలై 14 మధ్యాహ్నం 1.06 నుంచి 15 మధ్యాహ్నం 1.44 వరకు,
జూలై  24 ఉదయం 9.06 నుంచి 25 మధ్యాహ్నం 11.25 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.


ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి కర్కాటకరాశి  జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.

తదుపరి పోస్టింగ్ లో సింహరాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.