Wednesday, July 24, 2013

లక్ష్య సాధనా సామర్ధ్యం - 1

జీవితం చాలా విలువైనది. మన ఆలోచనలు, మన భావనలు కేవలం కోరికలకే పరిమితం కాకుండా అనేక లక్ష్యాలను సాధించే దిశగా ఉండటానికి జ్యోతిషశాస్త్రం ద్వారా విలువైన అంశాలను తెలుసుకోవచ్చు. కేవలం జీవనయానంలో సంభవించే ఒడి దుడుకులు కాకుండా ఆర్ధిక స్థితి గతులు కాకుండా... మహోన్నతమైన విజయ సాధన వైపు మన పయనం సాగటం కోసం జ్యోతిష్య నిర్ణయాలు అనేకం ఉన్నాయి. పేదరికం నుంచి రాచరికం వైపు వెళ్తుంటారు.  అనుకోకుండా వెనక్కి తిరిగి వస్తారు. అనుభవాలతో నిరాశా నిస్పృహలకు గురయ్యే వారూ ఉంటారు. జీవితంలో అనేక పాఠాలు నేర్చుకున్న మహనీయులు ఎంతో మంది ఉన్నారు. శూన్యంతో ప్రారంభించి నిరంతరం లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటూ ఓ క్రమ పద్దతిలో నడుస్తూ తమ జీవితాలను పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచుకొని సంవృద్ది వైపుకి, సంతృప్తి వైపుకి విజయం వైపుకి వెళ్లి వెలది మందికి జీవనోపాధి చూపించిన విశిష్ట వ్యక్తులు కూడా ఎంతో మంది ఉన్నారు.

లక్ష్యాలను ఏర్పరుచుకోవటం... మన విజయానికి అవసరమైన అతి పెద్ద నేర్పు. ప్రతి వ్యక్తిలో ఏదో ఓ సహజమైన శక్తి దాగి ఉంటుంది. ఈ శక్తితో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. సామర్ధ్యాన్ని అధికం చేయవచ్చు. అదే స్థాయిలోనే ఓ ప్రేరణకు రూపమిచ్చి తారా స్థాయిలో పయనించవచ్చు. మనం ఎక్కడ నించి వచ్చామన్నది ప్రస్తుతం అనవసరం. మన పయనమెటు... అనేది అవసరం. ఈ అంశం మన ఆలోచనల మీద, భావనల మీదా ఆధారపడి ఉంటుంది. అందుకే మన మనస్సు మన జీవితంలోని దాదాపు అనీ పార్శ్వాలని సృష్టించగలదు. ఓటమి చవి చూసి... ఇంకేమి అక్కర్లేదు అనుకునేవారు ఉంటారు.... తమ సమస్యలకు, బెంగలకు ఎవరో బాధ్యులని వాపోతున్నవారు ఉంటారు. మనసు లోతుల్లో ఉండే ఓ నియంత్రణ మరియు వ్యక్తీకరణలకు సంబంధించిన సామర్ధ్యం  ప్రతి ఒక్కరిలో ఉంటుంది.... ఆ సామర్ధ్యమేమిటో తెలుసుకోవటానికి 2013 జూలై 23 నాటి భక్తిమాల.టీవీ గ్రహబలం కార్యక్రమాన్నివీక్షించటానికి దిగువన క్లిక్ చేయండి. 

23 జూలై 2013 గ్రహబలం పార్ట్ 1 
23 జూలై 2013 గ్రహబలం పార్ట్ 2

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.