Thursday, October 10, 2013

అక్టోబర్ 13నే విజయదశమి

ఈ సంవత్సరం విజయదశమి పర్వదినం అక్టోబర్ 13వ తేది ఆదివారం నాడే ఆచరించాలి. 14వ తేది ఆచరించకూడదు. దీనికి సంబంధించిన ధర్మశాస్త్ర నిర్ణయాలను పాఠకులు, పండితులు గమనించి, ఆకళింపు చేసుకుని అక్టోబర్ 13న విజయదశమిని ఆచరించండి.
 
దినద్వయే అపరాహ్ణవ్యాపిత్యే శ్రవణర్క్షం యోగే పూర్వాకార్యా
యదా పూర్వస్మిన్ దినే అపరాహ్ణ వ్యాప్తి విశిష్ట
దశమ్యాం శ్రవణాభావః పరేద్యు ఉదయమాత్ర కాల వ్యాపినీ
దశమి శ్రవణ ర్క్షంయుతా చేత తదా పరాగ్రాహ్య - ధర్మసింధు


1. దశమి తిథి రెండు రోజులు ఉండి, రెండవరోజున అపరాహ్ణములో దశమి తిథి ఉన్నచో రెండవరోజే విజయదశమి
2. దశమి తిథి రెండు రోజులలోను అపరాహ్ణ సమయములో ఉండి శ్రవణానక్షత్రము ఉన్ననూ, లేకున్ననూ ముందురోజే విజయదశమి.
3. రెండు రోజులలో దశమి తిథి అపరాహ్ణంలో లేని యెడల, శ్రవణయోగము రెండురోజులలో ఉన్ననూ, లేకున్ననూ ముందురోజే విజయదశమి.
4. దినద్వయమందు అపరాహ్ణవ్యాప్తి ఉన్న పక్షములలో, ఏ రోజున శ్రవణయోగంతో కూడిన దశమి తిథి అపరాహ్ణంలో ఉండునో... అదే విజయదశమి.
5. ముందురోజు దశమి తిథి అపరాహ్ణ వ్యాప్తి కల్గి, రెండవ రోజు సూర్యోదయం  తదుపరి దశమి తిథికి మూడు ముహూర్తముల కాలం శ్రవణా నక్షత్రం కలిసి ఉన్నచో పరదినమే విజయదశమిని ఆచరించాలి.
 
ఇయమేవ  విజయదశమి సాచద్వితీ యదినే శ్రవణయోగా భావే పూర్వాగ్రాహ్య
దశమ్యాంతు నరైః సమ్యక్ పూజనీ యా పరాజితా ఐశానీం దిశమాశ్రిత్య అపరాహ్ణె ప్రయత్నతః - నిర్ణయసింధు


6. దశమి తిథికి రెండవరోజున శ్రవణనక్షత్ర యోగం లేకపోతే పూర్వపు రోజు గ్రహించాలి. జనులు దశమి తిథి యందు అపరాహ్ణ కాలములో ఈశాన్య దిక్కు నాశ్రయించి అపరాజితాదేవిని ప్రయత్న పూర్వకంగా పూజించాలి.
 
అశ్వినే శుక్ల పక్షేతు దశమ్యాం పూజయేన్నరః
ఏకాదశ్యాంచన కుర్వీత పూజనంచా పరాజితం
ఇతి యదాతు పూర్వ దినే శ్రవణ యోగాభావః పరదినే చాల్పాపితద్యోగినీ, తదా పరైవ తధా చ - నిర్ణయసింధు
   

7. ఆశ్వీజ శుక్ల దశమి తిధిన అపరాజితాదేవిని అర్చించాలి. ఏకాదశి నాడు అర్చించకూడదు. మొదటిరోజు శ్రవణం లేక, పరదినమందు కొద్దిగా శ్రవణ యోగం ఉన్నప్పుడు పరదినమే విజయదశమిని ఆచరించాలి.
 
అపరాహ్ణె పరదినే అపరాహ్ణె శ్రవణాభావేతు  సర్వ పక్షేషు పూర్వైవ - నిర్ణయసింధు 

8. శ్రవణా నక్షత్ర యోగంతో కూడిన అపరాహ్ణ వ్యాప్తి కల్గినదే విజయదశమి. రెండవ రోజు అపరాహ్ణకాలములో శ్రవణ యోగంలేనిచో ముందురోజే అన్నీ రకములుగా విజయదశమిని ఆచరించాలి. ఈ ఎనిమిదవ పాయింట్ ప్రకారం శ్రీ విజయలో విజయదశమి నిర్ణయానికి వర్తిస్తుంది.

దృగ్గణితరీత్యా 13 ఆదివారం దశమి తిధి మధ్యాహ్నం 1గం. 18ని. లకు ప్రారంభమై 14 మధ్యాహ్నం 11గం.16ని.లకు వెళ్ళిపోతున్నది. శ్రవణా నక్షత్రము 13 ఉదయం 6 గం.22ని.లకు ప్రారంభమై 14 సూర్యోదయం లోపలే 5గం.01ని.నకు శ్రవణం వెళుతుంది. 13 ఆదివారం దశమి మరియు శ్రవణా నక్షత్రమునకు అపరాహ్ణవ్యాప్తి కలదు. 14న శ్రవణా నక్షత్రం లేదు. పైన ఉదహరించిన ధర్మసిందు, నిర్ణయసింధు వంటి ప్రామాణిక ధర్మశాస్త్రాల నిర్ణయానుసారం ఇచ్చిన 8 పాయింట్లలో చివరి పాయింట్ ప్రకారం దృగ్గనితరీత్యా 13 అక్టోబర్ విజయదశమిని జరుపుకోవాలి. 14వ తేది సోమవారం విజయదశమి జరుపుకొనుటకు శాస్త్ర విరుద్ధము.

దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ మరియు చిరంజీవి నందిని గార్గేయ గార్లచే రచింపబడిన శ్రీ  విజయ నామ సంవత్సర కాలచక్ర పంచాంగం 25, 26 పేజీల నుంచి గ్రహింపబడినది.

Sunday, September 8, 2013

Ponnaluri Sreenivasa Gargeya contact mobile number: 9348032385


Tuesday, August 6, 2013

లక్ష్య సాధనా సామర్ధ్యం - 3

జ్యోతిషశాస్త్రంలో 8వ స్థానాన్ని ఆయు స్థానం అంటారు. ఈ స్థానాన్ని బట్టి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవించగలడో తెలుసుకోవచ్చు. కాని నాలుగు దశాబ్దాల జ్యోతిష అనుభవంతో జీవన స్థితి గతులను పరిశోధించి పరిశీలిస్తే ఒక క్రొత్త అంశం తెరపైకి వచ్చింది. అదే మనః కారకుడైన చంద్రుడు. ఈ చంద్రుడి యొక్క స్థితి గతులను బట్టి మన ఆయుష్షు నిర్ణయించవచ్చు. ప్రస్తుత కాలమాన పరిస్థితులను విశ్లేషిస్తే అచ్యున్నత మానవ శ్రేయస్సయిన మనఃశాంతి ఉంటే ఆయుష్షు పెరుగుతూ ఉంటుంది . లేనిచో తగ్గుతూ ఉంటుంది. ఒక లక్ష్యాన్ని లేక గమ్యాన్ని సాధించటానికి... గతంలో చెప్పిన నాలుగు ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్ళవచ్చును. అలా ముందుకు వెళ్ళినప్పుడు వ్యక్తికి కావలసింది మనఃశాంతి.... ఈ మనఃశాంతి ఉంటేనే లక్ష్య సాధనవైపు వెళ్ళగలడు. మరి ఈ మనఃశాంతి లేకుండా చేయటానికి ప్రధాన కారణం వత్తిడి. కనుక ఈ వత్తిడి ఏ విధంగా ఉంటుంది ? ఎందుకు ఉంటుంది ? కారణాలు ఏమిటి ? మొదలైన వివరాల కోసం ఈ దిగువన ఉన్న 25 జూలై 2013 నాటి భక్తిమాల. టీవీ లో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్ ను వీక్షించండి.

25 జూలై 2013 గ్రహబలం

Monday, August 5, 2013

లక్ష్య సాధనా సామర్ధ్యం - 2

2013 జూలై 23 తేది నాటి భక్తిమాల. టీవీ లోని వీడియో చూశారు కదా.. ప్రతి మనిషికి కోరికలు నిత్యం వస్తూ వుంటాయి. కొంతమంది ఊహలలో తేలుతూ ఉంటారు. రకరకములైన భావాలను ఊహించుకుంటుంటారు. లక్ష్యానికి, కోరికకు చాలా తేడా వుంది. ఒక లక్ష్యాన్ని సాధించటానికి గాని లేదా ఒక గమ్యాన్ని చేరటానికి గాని ఆచరించే ప్రణాళిక ఏదైతే ఉంటుందో దానిని గురించి ఊహించండి లేదా దానిని కోరికగా తెచ్చుకోండి. నవగ్రహాలలో మనఃకారకుడైన చంద్రుడు లక్ష్య సాధనలో ప్రధాన భూమికను పోషిస్తాడు. నేనేం చేయగలను ? అసమర్దుడను,  ఉత్సాహం ఉన్నప్పటికీ కార్యాచరణ వైపు మొగ్గు చూపలేని ఆశక్తుడను అనుకునేవారు ఎంతోమంది ఉంటారు. కనుక ఆ దిశగా ఆలోచించక.. మరో దిశగా ఆలోచిస్తూ లక్ష్య సాధనకు నడుం బిగించాలి. మొదటగా నాలుగు అవరోధాలు అడ్డు తగులుతాయి. ఈ అవరోధాలను ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. మొదటి మూడు అవరోధాలు చంద్ర గ్రహానికి సంబంధించినవి. నాలుగో అవరోధం మనః కారకుడైన చంద్రుడికి, బుద్ధి కారకుడైన బుధుడికి, ఆత్మకారకుడైన రవికి సంబంధించినవి. 23వ తేది నాటి ఎపిసోడ్ లో 30 తిధులలో శుక్ల పక్ష చవితి, శుక్ల సప్తమి శుక్ల త్రయోదశి, బహుళ చవితి, బహుళ సప్తమి, బహుళ త్రయోదశి తిధులు ప్రత్యేకంగా పరిహార రూపంలో ఉపయోగపడతాయి. అయితే ఈ ఎపిసోడ్ లో మూడు గ్రహాల సహకారంతో పూర్ణిమ తిథి ఉపయోగపడుతుంది. 
ఈ నాలుగు అవరోధాలు ఏమిటో అవి ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

24 జూలై 2013 గ్రహబలం

Tuesday, July 30, 2013

తెలంగాణా నిర్ణయ ముహూర్తము

30 జూలై 2013 మంగళవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై లాంచన ప్రాయ నిర్ణయం ప్రకటించిన సమయానికున్న స్థితిగతులను పరిశీలించినచో అనేక దోషాలు కనపడుతున్నవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నక్షత్రం చిత్ర అనగా కన్యా రాశి. ఈ చిత్ర నక్షత్రానికి... ప్రకటించిన సమయానికి ఉన్న భరణి నక్షత్రానికి తారాబలం  గమనిస్తే నైధన  తార అవుతుంది. నైధనతార అంటే చాలా ప్రమాదకరమైన తార అని భావము. అంతేకాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జన్మరాశి కన్యకు చంద్ర స్థితి అష్టమంలో ఉండటంకూడా దోషం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించిన సమయం మకరలగ్నం కావటం, ఈ లగ్నానికి కుజుని యొక్క తీవ్రమైన అష్టమ దృష్టి ఉండటం శుభకరం కాదు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు మకర లగ్నానికి అష్టమ స్థానంలో ఉండటం కూడా దోషపూరితం. అంతేకాక ఈ ప్రకటన ప్రకటించిన సమయంలో ఉన్న యోగము గండ యోగం కావటం కూడా శుభకరం కాదు. పై లక్షణాల కారణంచే ఈ లాంచన ప్రాయ నిర్ణయ ప్రకటన కార్యరూపం దాల్చటం కష్టసాధ్యము. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయానికి ఉన్న గ్రహస్థితి కంటే ఈ ప్రకటన వెలువడిన గ్రహస్థితి మరింత దారుణం. సమైక్యాంధ్రను కోరుకొనే తెలుగు ప్రజలందరూ సంయమనం పాటించండి. 
- గార్గేయ సిద్దాంతి

Wednesday, July 24, 2013

లక్ష్య సాధనా సామర్ధ్యం - 1

జీవితం చాలా విలువైనది. మన ఆలోచనలు, మన భావనలు కేవలం కోరికలకే పరిమితం కాకుండా అనేక లక్ష్యాలను సాధించే దిశగా ఉండటానికి జ్యోతిషశాస్త్రం ద్వారా విలువైన అంశాలను తెలుసుకోవచ్చు. కేవలం జీవనయానంలో సంభవించే ఒడి దుడుకులు కాకుండా ఆర్ధిక స్థితి గతులు కాకుండా... మహోన్నతమైన విజయ సాధన వైపు మన పయనం సాగటం కోసం జ్యోతిష్య నిర్ణయాలు అనేకం ఉన్నాయి. పేదరికం నుంచి రాచరికం వైపు వెళ్తుంటారు.  అనుకోకుండా వెనక్కి తిరిగి వస్తారు. అనుభవాలతో నిరాశా నిస్పృహలకు గురయ్యే వారూ ఉంటారు. జీవితంలో అనేక పాఠాలు నేర్చుకున్న మహనీయులు ఎంతో మంది ఉన్నారు. శూన్యంతో ప్రారంభించి నిరంతరం లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటూ ఓ క్రమ పద్దతిలో నడుస్తూ తమ జీవితాలను పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచుకొని సంవృద్ది వైపుకి, సంతృప్తి వైపుకి విజయం వైపుకి వెళ్లి వెలది మందికి జీవనోపాధి చూపించిన విశిష్ట వ్యక్తులు కూడా ఎంతో మంది ఉన్నారు.

లక్ష్యాలను ఏర్పరుచుకోవటం... మన విజయానికి అవసరమైన అతి పెద్ద నేర్పు. ప్రతి వ్యక్తిలో ఏదో ఓ సహజమైన శక్తి దాగి ఉంటుంది. ఈ శక్తితో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. సామర్ధ్యాన్ని అధికం చేయవచ్చు. అదే స్థాయిలోనే ఓ ప్రేరణకు రూపమిచ్చి తారా స్థాయిలో పయనించవచ్చు. మనం ఎక్కడ నించి వచ్చామన్నది ప్రస్తుతం అనవసరం. మన పయనమెటు... అనేది అవసరం. ఈ అంశం మన ఆలోచనల మీద, భావనల మీదా ఆధారపడి ఉంటుంది. అందుకే మన మనస్సు మన జీవితంలోని దాదాపు అనీ పార్శ్వాలని సృష్టించగలదు. ఓటమి చవి చూసి... ఇంకేమి అక్కర్లేదు అనుకునేవారు ఉంటారు.... తమ సమస్యలకు, బెంగలకు ఎవరో బాధ్యులని వాపోతున్నవారు ఉంటారు. మనసు లోతుల్లో ఉండే ఓ నియంత్రణ మరియు వ్యక్తీకరణలకు సంబంధించిన సామర్ధ్యం  ప్రతి ఒక్కరిలో ఉంటుంది.... ఆ సామర్ధ్యమేమిటో తెలుసుకోవటానికి 2013 జూలై 23 నాటి భక్తిమాల.టీవీ గ్రహబలం కార్యక్రమాన్నివీక్షించటానికి దిగువన క్లిక్ చేయండి. 

23 జూలై 2013 గ్రహబలం పార్ట్ 1 
23 జూలై 2013 గ్రహబలం పార్ట్ 2

Thursday, July 18, 2013

Best Wishes to Justice P.Sathasivam

President Sree Pranab Mukherjee called Sree P Sathasivam to congratulate him on his elevation as Chief Justice of India. During the conversation, Sathasivam requested  Pranab Mukherjee to allow him to take the oath at 9:30 am on Friday, instead of 11 am on 19th July 2013. The chief justice says the working hours of the Supreme Court will not be disturbed on Friday if swearing-in ceremony is held at 9:30 am and the second reason, is the "inauspicious time of Rahu Kalam on Friday is between 10:30 and 12:00 pm." The president has agreed.  So P Sathasivam takes oath today at 9.30 am Simha lagna time. Lagna Shukra graha is highly favourable. 

Bhakthimala Tv Organised by Sreenivasa Gargeya congratulating Justice P Sathasivam 40th Chief Justice of India designate for being the first judge from Tamil Nadu to be elevated to the top post of judiciary in the country.

Ponnaluri Sreenivasa Gargeya contact mobile number: 9348032385

Sunday, July 14, 2013

మీ భవిష్యత్ మీ ఆలోచనల్లోనే ~ Take decisions by positive thinking

 కాలచక్రం సకలం మారుస్తూ ఉంటుంది గతంలో ఉన్నది ఇప్పుడు ఉండదు . నేడు ఉన్నది మరో రోజు ఉండదు. నిరంతరమూ మార్పులు జరగటమన్నదే వాస్తవంగా కనపడుతుంటుంది. గత రోజులను ఎవ్వరూ కూడా మార్చలేం. కానీ ఆత్మ, మనో బలాలతో బుద్ధి బలాన్ని పెంచుకొని కాలచక్రంలో దొర్లే రానున్న రోజులలోని మన స్థితులను మార్చుకొనగలం . గతం కంటే రానున్న భవిష్యత్  లో మీ స్థితిని ఉన్నతం చేసుకొని, పరాజయాలని విజయాలుగా మార్చటానికి, మీ జీవిత వైఖరులను, మీ దృష్టి కోణాలను, మీ ఆలోచనలతో నూతన ప్రేరణా భావనలను మార్చుకోవటానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఒక్క నిముషం మాత్రమే... ఆలోచించి నిర్ణయం తీసుకొని, ఆచరించిన క్షణంలో.. మీరు మీ జీవితాన్నిమార్చుకుంటారు. మీ నిర్ణయాలు మీ చర్యలను నిర్ణయిస్తాయి. మీ చర్యలే నూతన మార్పును సృష్టిస్తాయి. మీ జీవితంలో సానుకూల మార్పు, పరివర్తన కలగాలంటే కేవలం నాలుగే అంశాలు అవసరం. 1. దృష్టి  2. నిర్ణయం 3. క్రియ 4. కోరిక ... ఇవే మీ పరాజయాలని విజయాలుగా మారుస్తాయి. మీ  దిశా దశలను నిర్దేశిస్తాయి. ప్రతివారి జీవితంలో సానుకూల మార్పు మహా అవసరం. అందుకే నిత్యం గమనించటానికి ప్రయత్నించండి గ్రహబలం కార్యక్రమం. - శ్రీనివాస గార్గేయ

Saturday, July 6, 2013

10 జూలై 2013 నుంచి భక్తిమాల.టీవీలో జ్యోతిషప్రసారాలు లైవ్ లో ప్రారంభం ~ Astrological Live programmes in Bhakthimala.tv soon


భక్తిమాల.టీవీ ప్రారంభించి దాదాపు 11 మాసాలు కావచ్చింది. ఎన్నో బాలారిష్టాలను అధిగమిస్తూ ముందుకి తీసుకొని వెళ్తున్నాము. అయితే ఇంతవరకు జ్యోతిష కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారంలో అందించలేకపోయాము. ప్రేక్షకులు ఎంతో ఓర్పుతో ఉన్నందుకు ధన్యవాదాలు. 

10 జూలై 2013 బుధవారం నుంచి నిత్యం భక్తిమాల.టీవీలో ప్రత్యక్షప్రసారం ద్వారా జ్యోతిష కార్యక్రమాలు ప్రారంభమవునని  తెలియచేయుటకు సంతోషిస్తున్నాం. ఈ మాసం నుంచే ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు జ్యోతిష సమాధానాలు కూడా ఉంటాయని తెలియచేస్తున్నాం. ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 8.30 వరకు ప్రత్యక్ష ప్రసారాలద్వారా విశేష వివరణలు, మాసవారీ గ్రహ సంచార స్థితిగతులు, ఫలితాలు, జ్యోతిశాస్త్ర సందేహాలకు శాస్త్రీయ జవాబులు, పర్వదినాలపై విశ్లేషణలు, గతంలో చెప్పిన పరిహారాల పై  సందేహ నివృత్తి, రాజయోగ పరిహారాలు, షోడశ చూతపత్ర కదంబ విశ్లేషణలు మొదలైన ఆసక్తికర అంశాలను ప్రత్యక్ష ప్రసారంలో అందించగలం.  ప్రేక్షకులు  ఈ అవకాశాన్నివినియోగించుకోగలరని ఆశిస్తున్నాను. 

ప్రత్యక్షప్రసారంలో చూడదలుచుకున్నవారు ఇక్కడ క్లిక్ చేయండి
bhakthimala.tv

- గార్గేయ సిద్దాంతి 

Thursday, July 4, 2013

వివాహ సమస్యలకు గోరింట బొట్టుతో పరిహారం ~ Henna Bindi Remedy

భక్తిమాల. టీవిలో ఈ మధ్య కాలంలో వివాహ సమస్యలపై కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. ఈ సమస్యలు అనుభవిస్తున్నవారు ఎందరెందరో ఉన్నారు. ముఖ్యంగా 1977 ఏప్రిల్ 30 రాత్రి 10.30 నుంచి 1983 జూలై 13 రాత్రి 8.40 మధ్యకాలంలో జన్మించిన వారికి వివాహమై, సమస్యలతో ఉంటుంటే... ఉపశాంతి మార్గంగా పరిహారము గోరింట బొట్టుతో ఆచరించవచ్చు. ఈ గోరింట బొట్టును కేవంలం చైత్ర,  వైశాఖ, శ్రావణ, ఆశ్వీజ, కార్తిక, మార్గశిర మాసాలలో, కొన్ని ప్రత్యేక సమయాలలో, ప్రత్యేకతలతో తయారుచేసుకుని ఆచరించాలి. ఈ గోరింట బొట్టును తయారు చేసుకొనటం విధివిధానాన్ని 6 జూలై 2013 న భక్తిమాల. టీవి లో ప్రసారమగును. కనుక వీక్షించండి. పలువురికి తెలియచేయండి.

1977 ఏప్రిల్ 30 రాత్రి 10.30 నిముషాలకు ముందు, మరియు 1983 జూలై 13 రాత్రి 8.40 నిముషాల తదుపరి జన్మించిన జాతకుల వివాహ సమస్యలకు కూడా ఉపశాంతి పరిహారం కూడా త్వరలో ప్రసారమగును.

Wednesday, July 3, 2013

జూ లై నెల కేలండర్

                                                      జూ లై  నెల  కేలండర్







Saturday, May 4, 2013

జూన్ నెల కేలండర్

                                     జూన్  నెల  కేలండర్ 








Wednesday, April 24, 2013

చైత్రపూర్ణిమకు పాక్షిక చంద్రగ్రహణం

శ్రీ విజయ నామ సంవత్సర చైత్ర మాసం పూర్ణిమ గురువారం అర్ధరాత్రి 25/26 ఏప్రిల్ 2013 తులారాశిలో స్వాతి నక్షత్రమందు రాహుగ్రస్తంగా పాక్షిక చంద్రగ్రహణం సంభవించును. ఈ గ్రహణం నైరుతిదిశలో స్పర్శించి ఆగ్నేయదిశలో మోక్షముండును. యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా ఖండములందు గోచరించును. 

నైరుతిదిశన పాక్షిక చంద్రగ్రహణ ప్రారంభం రాత్రి 1గంట 24 నిముషాలు
దక్షిణదిశన చంద్రగ్రహణ మధ్యకాలం రాత్రి 1గంట 37నిముషాలు
ఆగ్నేయాన గ్రహణ మోక్షకాలం రాత్రి 1గంట 51 నిముషం
చంద్రగ్రహణ పుణ్యకాలం కేవలం 27 నిముషాలు మాత్రమే

 

చంద్రగ్రహణ ప్రారంభానికి ముందు, గ్రహణ మోక్షం తదుపరి కొంత సమయం పాటు చంద్రుని యొక్క కాంతి క్షీణించి ఉంటుంది. కనుక గ్రహణ ముందు మరియు చివరలో ఏర్పడే క్షీణించిన కాంతికి ఓ పేరుంది. దానినే ప్రచ్చాయ గ్రహణము అంటారు. సహజంగా మనకు కనపడే గ్రహణాన్ని ఛాయా గ్రహణము అంటారు. తేజోహీన కాంతి చంద్రుడిని ప్రచ్చాయ గ్రహణం అంటారు.
 

పాక్షిక చంద్ర గ్రహణానికి ముందు 110 నిముషాలు గ్రహణ మోక్షం తదుపరి 110 నిముషాలు చంద్రుడు కాంతి విహీనంతోనే ఉంటాడు. 110 నిముషాలకు ముందు పూర్ణ తేజస్సుతో ఉంటాడు. తిరిగి 110 నిముషాల తర్వాత పూర్ణ తేజస్సులోకి వస్తాడు.
 

మరి ఈ పరంపరలో చైత్ర పూర్ణిమకు పాక్షిక గ్రహణము రాత్రి 1గంట 24నిముషాలకు  ఏర్పడును. దీనికి 110 నిముషాలు ముందు నుంచి తేజోహీన కాంతి ప్రారంభమగును. అనగా రాత్రి 11 గంటల 34 నిముషాలు. అలాగే గ్రహణ మోక్షం రాత్రి 1 గంట 51 నిముషం. దాని తదుపరి 110 నిముషాల వరకు చంద్రుడు తేజోహీన కాంతితోనే ఉంటాడు. అనగా రాత్రి 3గంటల 41 నిముషం వరకు హీన కాంతి ఉండును .
 

కనుక గర్భవతులు రాత్రి 11 గంటల 34 నిముషాల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల 41 నిముషం వరకు తమ శరీరానికి కాంతి సోకకుండా జాగ్రత్తలు తీసుకునేది. గర్భవతులు మల, మూత్ర విసర్జన చేయవచ్చును. ఆ సమయంలో మేల్కొని ఉన్నప్పటికీ తమ పనులను నిరభ్యంతరంగా చేసుకోవచ్చును. ఒకవేళ టీవీలలో గ్రహణ దృశ్యాలు చూపించినచో చక్కగా చూడ వచ్చును. భయపడవలసిన అవసరం లేదు. ఈ గ్రహణ ప్రభావము ద్వాదశ రాశులపై ఏమి ప్రభావము చూపదు. ఎందుకంటే చంద్రుడు మరో కొన్ని గంటల తదుపరి తన నీచ స్థానమైన వృశ్చిక రాశిలోకి వెళ్ళబోతున్నాడు. కనుక గ్రహణ ప్రభావం శూన్యం.