12 అక్టోబర్ 2017 గురువారం ఉదయం 7గంటల నుంచి 8 గంటల వరకు యోగి శాటిలైట్ టెలివిజన్ లో గార్గేయం కార్యక్రమంలో 'అష్టభుజి' అనే జ్యోతిష ఆధ్యాత్మిక ధారావాహికలు అందించనున్నాను.ఇందులో భాగంగా రేపే మొదటిభాగం ప్రసారం కాబోతున్నది....శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని అతిరహస్య నామాలతోనే ఈ 'అష్టభుజి' కార్యక్రమం ఉంటుంది. కనుక అందరూ వీక్షించవలసినది.- దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ

Sunday, September 30, 2012

వివాహాలలో అనుకూల ప్రతికూల నక్షత్రాలు

మీ సంతానంలోని యువతీ యువకులకు వివాహం చేయాలంటే... ముందుగా గమనించాల్సింది సరియైనటువంటి పొంతన గల నక్షత్రాలను ఎంచుకోవటం. ఈ ఎంచుకునే సందర్భంలో క్షేమ తారాబలంతో ఉన్న నక్షత్రాలను వదిలివేయాలి. ఎందుకంటే రెండవ వైపు నుంచి లెక్కిస్తే నైధన అనే ప్రమాదకర తారాబలం వస్తుంది. కనుక వదిలివేయాలి.  అలాగే తారాబలంతో ఉన్న మరికొన్ని నక్షత్రాలు 'షష్ట అష్టకములు'గా ఉండును. (వ్యతిరేకములు) ఈ పరంపరలో అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు వివాహ పొంతనలకు ఏయే నక్షత్రాలు అనుకూలమో, ఏవి ప్రతికూలమో తెలుసుకోవాలంటే దిగువ వీడియోని క్లిక్ చేయండి. ఈ రోజు నుంచి 27  నక్షత్రాలు వారికి వివాహాలలో అనుకూల, ప్రతికూల నక్షత్రాలు తెలియచేస్తాను. అక్టోబర్ మధ్య నుంచి చక్కని పరిష్కార మార్గాలను మీ మీ సమస్యలకు తెలియచేయగలను. ఈ లోపల మీ బంధుమిత్రాదులందరికి భక్తిమాల. టీవీ వివరాలను తెలియచేయగలరని ఆశిస్తున్నాం. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.