Sunday, July 29, 2012

ఒకేసారి ఆచరించే నవరక్షాకవచ పూజ విధి - భాగం 4

ఇక షోడశోపచారాలతో కలశపూజను ఆచరించాలి
  • ఉపచార పూజలలోని అన్ని శ్లోకాలను చదవలేని వారు ఓం శ్రీమాత్రే నమః అని భక్తితో ధ్యానించండి. 
ధ్యానం

శ్లో. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం
అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానీం
(ఈ శ్లోకము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ధ్యాన శ్లోకాలలో రెండవది. ఓ పుష్పాన్ని తీసుకొని పై శ్లోకం చదువుతూ భక్తితో... పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )

ఆవాహనం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 169 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
ఆవాహనం సమర్పయామి... అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )

సింహాసనం

(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 170 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
సింహాసనం సమర్పయామి... అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )

పాద్యం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 
171 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
పాద్యం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )

అర్ఘ్యం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 
172 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
అర్ఘ్యం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )

ఆచమనం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 
173 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
ఆచమనం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )

శుద్ధోదక స్నానం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 
174 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
శుద్ధోదక స్నానం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి.)

వస్త్రం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 175 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
వస్త్రం సమర్పయామి, వస్త్రార్ధం పుష్పం సమర్పయామి ... 
అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )

ఆభరణం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 176 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
ఆభరణం సమర్పయామి, ఆభరణార్ధం పుష్పం సమర్పయామి ... 
అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )

శ్రీ గంధం లేక కుంకుమ
(శ్రీ గంధం లేక కుంకుమ తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 
177 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
శ్రీ గంధం / కుంకుమ విలేపనం సమర్పయామి... అని చెప్పి గంధాన్ని లేక కుంకుమను కలశం మీదున్న కొబ్బరి కాయపై ఉంచండి. )
అక్షతాన్ 
స్వస్తిక్ రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
1. ఓం మనోరూపేక్షుకోదండాయై నమః  సహస్రనామాలలో 10 వ నామం
2. ఓం మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసాయై నమః - 28 వది
3. ఓం మాణిక్యమకుటాకార జానుద్వయవిరాజితాయై నమః  40 వది
4. ఓం మరాళీమందగమనాయై నమః  సహస్రనామాలలో 47 వ నామం
5. ఓం మహాలావణ్యశేవధయే నమః  సహస్రనామాలలో 48 వ నామం
6. ఓం మహాపద్మాటవీసంస్థాయై నమః  సహస్రనామాలలో 59 వ నామం
7. ఓం మంత్రిణ్యంబావిరచితవిషంగవధ తోషితాయై నమః  75 వ నామం
8. ఓం మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః  78 వ
ది
9. ఓం మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసుర సైనికాయై నమః
సహస్రనామాలలో 81 వ నామం

షోడశ బిందు త్రిభుజ రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
10. ఓం మణిపూరాంతరుదితాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 101 వ నామం
11. ఓం మహాశక్త్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 109 వ నామం
12. ఓం మదనాశిన్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 159 వ నామం
13. ఓం మమతాహంత్ర్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 165 వ నామం
14. ఓం మనోన్మన్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 207 వ నామం
15. ఓం మాహేశ్వర్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 208 వ నామం
16. ఓం మహాదేవ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 209 వ నామం
17. ఓం మహాలక్ష్మ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 210 వ నామం
18. ఓం మృడప్రియాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 211 వ నామం

శ్రీం రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను చదువుతూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
19. ఓం మహారూపాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 212 వ నామం
20. ఓం మహాపూజ్యాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 213 వ నామం
21. ఓం మహాపాతకనాశిన్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 214 వ నామం
22. ఓం మహామాయాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 215 వ నామం
23. ఓం మహాసత్త్వాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 216 వ నామం
24. ఓం మహాశక్త్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 217 వ నామం
25. ఓం మహారత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 218 వ నామం
26. ఓం మహాభోగాయై నమః  
శ్రీ లలిత సహస్రనామాలలో 219 వ నామం
27. ఓం మహైశ్వర్యాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 220 వ నామం

హ్రీం రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
28. ఓం మహావీర్యాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 221 వ నామం
29. ఓం మహాబలాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 222 వ నామం
30. ఓం మహాబుద్ధయే నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 223 వ నామం
31. ఓం మహాసిద్ధయే నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 224 వ నామం
32. ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 225 వ నామం
33. ఓం మహాతంత్రాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 226 వ నామం
34. ఓం మహామంత్రాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 227 వ నామం
35. ఓం మహాయంత్రాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 228 వ నామం
36. ఓం మహాసనాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 229 వ నామం

ఐం రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
37. ఓం మహాయాగక్రమారాధ్యాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 230 వ నామం
38. ఓం మహాభైరవపూజితాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 231 వ నామం
39. ఓం మహేశ్వరమహా కల్పమహా తాండవసాక్షిణ్యై నమః
సహస్రనామాలలో 232 వ నామం
40. ఓం మహాకామేశమహిష్యై నమః  
సహస్రనామాలలో 233 వ నామం
41. ఓం మహాత్రిపురసుందర్యై నమః 
సహస్రనామాలలో 234 వ నామం
42. ఓం మహాచతుషష్టికోటియోగినీ గణసేవితాయై నమః 
సహస్రనామాలలో 237 వ నామం
43. ఓం మనువిద్యాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 238 వ నామం
44. ఓం మధ్యమాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 370 వ నామం
45. ఓం మహాకామేశనయనకుముదాహ్లాదకౌముద్యై నమః  
403 వ నామం

గం రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
46. ఓం మదశాలిన్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 431 వ నామం
47. ఓం మదఘూర్ణితరక్తాక్ష్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 432వ నామం
48. ఓం మదపాటలగండభువే నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 433 వ నామం
49. ఓం మాలిన్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 455 వ నామం
50. ఓం మాత్రే నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 457 వ నామం
51. ఓం మలయాచలవాసిన్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 458 వ నామం
52. ఓం మహావీరేంద్రవరదాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 493 వ నామం
53. ఓం మణిపూరాబ్జనిలయాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 495 వ నామం
54. ఓం మాంసనిష్ఠాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 500 వ నామం

ఓం రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను చదువుతూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
55. ఓం మధుప్రీతాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 510 వ నామం
56. ఓం మజ్జాసంస్థాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 524 వ నామం
57. ఓం మహాప్రళయ
సాక్షిణ్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 571 వ నామం
58. ఓం మాధ్వీపానాలసాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 575 వ నామం
59. ఓం మత్తాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 576 వ నామం
60. ఓం మాతృకావర్ణరూపి
ణ్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 577 వ నామం
64. ఓం మహాకైలాసనిలయాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 578 వ నామం
62.
ఓం మహనీయాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 580 వ నామం
63. ఓం మహాసామ్రాజ్యశాలిన్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 582 వ నామం

నాణెము అనబడే రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
64. ఓం మహావిద్యాయై నమః   శ్రీ లలిత సహస్రనామాలలో 584 వ నామం
65. ఓం మాయాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 716 వ నామం
66. ఓం మధుమత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 717 వ నామం
67. ఓం మహ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 718 వ నామం
68. ఓం మహేశ్వర్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 750 వ నామం
69. ఓం మహాకాళ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 751 వ నామం
70. ఓం మహాగ్రాసాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 752 వ నామం
71. ఓం మహాశనాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 753 వ నామం
72. ఓం మహత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 774 వ నామం

కలశం మీద ఉన్న కొబ్బరికాయపై గల 11 పోగుల రక్షాకవచం పై...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను వేయండి.
73. ఓం మందారకుసుమప్రియాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 776 వ నామం
74. ఓం మార్తాండభైరవారాధ్యాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 785 వ నామం
75. ఓం మంత్రిణీన్యస్తరాజ్యధురే నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 786 వ నామం
76. ఓం మంత్రసారాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 846 వ నామం
77. ఓం మనస్విన్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 930 వ నామం
78. ఓం మానవత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 931 వ నామం
79. ఓం మహేశ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 932 వ నామం
80. ఓం మంగళాకృత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 933 వ నామం
81. ఓం మనోమయ్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 941 వ నామం

ఇంతటితో ఒక్కో రక్షా కవచానికి 9 నామాల చొప్పున 9 రక్షాకవచాలకి 81 నామాలతో పూజ పూర్తయింది. తదుపరి 3 కొబ్బరి గిన్నెలలోని 21 పుష్పాలు తీసుకోండి. 
దేవి సప్తశతిలోని దిగువ తెల్పిన శ్లోకాలలో శ్లోకాన్ని ఒక్కొక్క భక్తితో పఠిస్తూ ఒక్కో పుష్పాన్ని విశ్వాసంతో కలశంపై ఉంచండి. )
 

మొదటి పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
 ఓం యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా
 

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

2 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి. 
ఓం యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

3 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్ భూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

4 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

5 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

6 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

7 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

8 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

9 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు క్షాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

10 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

11 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

12 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

13 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు శ్రద్దారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

14 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

15 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

16 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

17 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

18 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

19 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి. ఓం యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

20 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

21 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


ధూపం
(
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 178 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
ధూపమాఘ్రాపయామి... అని చెప్పి అగరుబత్తీలను చూపండి.  )

 

దీపం
(
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 179 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
దీపం దర్శయామి, దూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి ... అని చెప్పి తమలపాకుతో నీటిని కలశంపై చల్లండి )

 

నైవేద్యం
(
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 180 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
నైవేద్యం సమర్పయామి... అని చెప్పి మీరు చేసిన నైవేద్యాన్ని ఇతర ఫలాలు గాని, కొబ్బరికాయ మొదలైన వాటిని నివేదించండి. )

 

తాంబూలం
(
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 181 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
తాంబూలం సమర్పయామి... అని చెప్పి తాంబూలాన్ని కలశం ముందు ఉంచండి. )

 

నీరాజనం
(
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 182 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
దివ్య మంగళ నీరాజనం సమర్పయామి... అని చెప్పి కర్పూర హారతిని ఇవ్వండి. )

 

మంత్రపుష్పం
(
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 183 వ శ్లోకంలోని మొదటి లైన్ ను చూడండి.
 " ఓం శ్రీ శివా శివశక్త్యైకరూపిణీ  లలితాంబికా " అనే పంక్తిని భక్తితో చదువుతూ
.... 

పుష్పాన్ని తీసుకొనిదివ్య మంత్ర పుష్పం సమర్పయామి... 
అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. ) 
  • చివరగా సకల సమస్యల నుంచి గట్టేక్కుతూ ఈ జీవన గమనం సాఫీగా సాగిపోవాలని మనసార భక్తి, విశ్వాస, నిర్మలత్వంతో ఆత్మప్రదక్షిణ చేయండి. 
  • చిన్నపాటి తప్పులేమైన వుంటే క్షమించమని తల్లిని వేడుకోండి. పూజా కార్యక్రమం పూర్తైన తదుపరి తీర్థ, ప్రసాదాలు స్వీకరించండి. 
  • పూజ పూర్తి అయిన తర్వాత కలశాన్ని ఉద్వాసన చెప్పే విధంగా కుడి చేతితో స్వల్పంగా కదపండి.
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.