శ్రీ హేమలంబ మాఘ పూర్ణిమ 31 జనవరి 2018 బుధవారం కర్కాటకరాశిలో పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో రాహుగ్రస్తంగా రక్తవర్ణంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును.ఇది నీలిరంగులో (బ్లూ మూన్ గా) ఉండదు. కేవలం రక్త వర్ణం మాత్రమే.ఈ చంద్ర గ్రహణం వలన ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Tuesday, May 8, 2012

సకల శుభాలనొసంగే పంచ బీజాక్షర సర్వతోభద్ర మండలం

శ్రీ మహాగణాధిపతయే నమః

గ్రహభూమి పాఠకులందరి ద్వారా సర్వ జగత్తుకు శుభాలు కలగాలనే 
ఆకాంక్షతో చేసే చిన్ని ప్రయత్నమే ఈ సర్వతోభద్రచక్రమండలం. 

శ్రీ నందన నామ సంవత్సరానికి రాజు, మంత్రి శుక్రుడు కావటం, ఈ శుక్రునికి జూన్ 5 , 6 వ తేదీలలో (స్వదేశీ, విదేశీ) గ్రహణం జరగబోతున్నది. ఈ గ్రహణాన్ని మనం వీక్షించబోతున్నాం. గతంలో తారణ నామ సంవత్సరంలో కొంతమంది వీక్షించివుంటారు. దానికి 105 సంవత్సరాల ముందు జరిగింది. అప్పుడు వీక్షించినవారెవరు ప్రస్తుతం ఉండరనే భావించాలి. తిరిగి 2117 డిసెంబర్ లో శుక్ర గ్రహణం రాబోతున్నది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితులను ఒకసారి గమనిస్తే.... రాబోయే రోజులలో ఎలా ఉంటాయో అనే ఓ భయం వెంటాడుతుంటుంది. జనాభా పెరిగిపోతూ ఉంది. ఆహార ధాన్యాల కొరత కూడా దానికి తగినట్లే పెరుగుతున్నది. 

పర్యావరణం పూర్తిగా కలుషితమైపోతున్నది. తాగటానికి గుక్కెడు మంచి నీరు కూడా దొరకని రోజులు కూడా రాబోతున్నయేమో. వృక్ష సంపద ఒక వైపు నాశనమవుతున్నది. వర్షాభావ పరిస్థితులు కూడా అలాగే ఉంటున్నాయి. వ్యవసాయం పండించే వారే.... పరిస్థితుల ప్రభావంచే పొట్ట కోసం పట్టణ ప్రాంతాలకు తరలి వస్తున్నారు. పండించే వారు తగ్గి పోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉంటే రాబోయే రోజులలో... నాకే కాదు... మీకే కాదు... మనందరికీ ఒక సముచితమైన ఆలోచనాభావం ఇప్పటినుంచే మెదలాలి. ఒక్క వ్యక్తి వలన కాకుండా... వందలాది... వేలాది.. లక్షలాది ప్రజల ద్వారా కొంత మార్పును మనలోనూ, మన సమాజంలోనూ తీసుకొని రాగలితే... కొంతకు కొంత శుభకరమైన ఫలితాలను పొందగలిగిన వారిమగుదుము.

ప్రతి మనిషిలో మార్పు రావాలన్నాఎదుటి వారు చెప్పింది వినాలన్నాకొంత ఓర్పు అవసరం. ఓర్పుతో పాటు చెప్పినది ఆచరించాలన్న తపన కూడా అవసరం. ఆ తపన ఏర్పడితే.... ఆచరించటానికి సిద్దపడతారు. ఈ ఆచరణతో మనలో మానవతా భావం పెరుగుతుంది. ఈ భావంతో సాధించాలనుకున్నది సాధించితీరుదుము. మన కృషికి, సంకల్పానికి దైవబలం కూడా తోడుకావాలి. అందుకే ఈ మూలా నక్షత్ర సంచార సమయంలో ఈ బ్లాగ్ లో ఇచ్చిన సర్వతోభద్రచక్ర మండలాన్ని తపనతో, ఆసక్తితో, విశ్వాసంతో,
భక్తీతో వీక్షించండి. సర్వతోభద్రచక్రమండలం (వివరాలు తదుపరి రోజులలో) లో ప్రత్యేకంగా ఐదు బీజాక్షరాలు నిక్షిప్తమై వున్నాయి. 

సర్వ అంటే సకలమని, భద్ర అంటే శుభాలని భావము. కనుక ఈ సకల శుభాలను పరోక్షంగా పొందటానికి ప్రధమ మార్గం అంటూ ప్రతి వారికి అవసరం. కలశపూజలను ఆచరించిన, ఆచరించకపోయినా కనీసం ఈ సర్వతోభద్రచక్ర మండలంలో ఉన్న ఐదు బీజక్షరాలను వీక్షించారు కదా, దీని రూపాన్ని మీ మనసులలో ఒకసారి ముద్రితం చేసుకోండి. ప్రత్యేకంగా చిత్రపటం కట్టి ఉంచాల్సిన అవసరం లేదు. మధ్యలో ఉన్న చదరం నుంచి ఓం అనేటువంటి ప్రణవంతో ప్రారంభమై, దాని దిగువ ఉన్న గణపతి బీజంతో మొదలై సవ్య దిశలో ఐం అనే సరస్వతీ బీజ సంపదతో, హ్రీం అనే బీజం ద్వారా సుస్థిర పరిపాలనను పొందుతూ, శ్రీం అనే బీజం ద్వారా ఈ జగత్తులో బ్రతకటానికి కావాల్సిన వనరులను సమకూర్చుకోవటానికి అవసరమగును.

పైన చెప్పిన ఈ ఐదు బీజక్షరముల అధిష్టాన దేవతలతో కూడినదే కలశపూజలు మరియు కీర్తిముఖుడు. రాబోయే మూలా నక్షత్రంలోనే శుక్రగ్రహణం సంభవించనుంది. అందుకే ఈ మూల నక్షత్ర సమయంలో ఈ సర్వతోభద్రచక్ర మండలాన్ని వీక్షించండి. నిత్యం మీ మనసులలో భద్రచక్ర మండల రూపాన్నిస్మరించండి. ఒకవేళ వీక్షించాలేనివారికి పై వివరాలు తెలియచేసి వీక్షించమని చెప్పండి. విశేషమైన శుభాలు మనదరికి కలగాలని, ప్రాణాధారమైన జల సంపదను ప్రతి ఒక్కరు కాపాడాలని కోరుకుంటూ..
రాబోయే రోజులలో వాణిజ్య దృక్పధంతో కాక, మానవతా భావంతో ఓంకార మహాశక్తి పీఠం ట్రస్ట్ ద్వారా అందరికీ మరిన్ని విశేషాలు అందబోతున్నవని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.