Friday, May 4, 2012

2012 మే 5 నాటి 8 , 9 కలశపూజల వివరాలు - ఐదవ పోస్టింగ్

పాఠకులు ఎంతో భక్తి, శ్రద్ధలతో కలశపూజలను ఆచరిస్తున్నందుకు చాలా సంతోషం.

మే 5 వ తేది ఆచరించే కలశపూజలలో మొదట గణపతిని పసుపు ముద్దతో చేసుకొని తమలపాకులపై ఉంచి పూజించాలని చెప్పటం జరిగింది.
అవకాశం లేనటువంటి వారి పసుపు గణపతికి బదులుగా, చిత్రపటమునైనా పూజించుకోనేది.
కొన్ని కొన్ని ప్రాంతీయ ఆచారాల ప్రకారం పుణ్యస్త్రీలు కాని వారు చిత్రపటమును పూజించేది.

వరుసగా ఇంతవరకు 7 కలశపూజలు ఆచరించిన వారు మాత్రమే 8 , 9 కలశపూజలను ఆచరించండి.

7 కంటే తక్కువ ఆచరించినవారు దయచేసి 8 , 9 ఆచరించవద్దు.
మరి ఇలాంటి వారికి అవకాశం ఎప్పుడు, అనే అనుమానం వస్తుంది. త్వరలోనే ఆయా తేదీలు తెలియచేస్తాను.

మొదటి 3 చేయకుండానే.... 4 , 5 , 6 , 7 చేసిన వారు ఉన్నారని తెలుస్తున్నది. వారు ఎలా చేసారో అర్థం కావటం లేదు.
కనుక అలాంటి వారు చేసినవి నిష్ప్రయోజనం. కనుక ఒకేసారి తొమ్మిది చేసుకోవటానికి ప్రయత్నించండి.
లేదా రాబోయే మాసాలలో అంచలంచలుగా చేసుకోవటానికి ప్రయత్నించండి.

పూజకు ముందు ఉదయాన్నే సూర్యనమస్కారాన్ని మరచిపోకండి.

లలితా సహస్ర నామావళి మరియు సహస్రనామ స్తోత్రం అందుబాటులో ఉన్నవారు...
ఆయా సంఖ్యలు చెప్పిన చోట ఉన్న నామాలని, శ్లోకాలని పఠించండి.
అవకాశం లేనివారు శ్లోకాలు, నామాలు చెప్పవలసిన చోట.. ఓం శ్రీమాత్రే నమః అని భక్తి, ప్రపత్తులతో పఠించండి.

పూజా కార్యక్రమం పూర్తయ్యేంతవరకు మిగిలిన వ్యాపకాలకు దయచేసి స్వస్తి పలకండి. ఏకాగ్రత ముఖ్యం.

రక్షాకవచాల విషయంలో... శ్రద్దగా, నిదానంగా ఆయా బీజాక్షర రక్షాకవచాల వరుసను బట్టి పూజా చేసుకోండి. రక్షాకవచ వరుస తప్పి పూజా చేసుకొంటే నిష్ప్రయోజనం.

కలశంపై పెట్టిన కొబ్బరికాయను తదుపరి కొట్టినప్పుడు అందులో నీళ్ళు దెబ్బతినటమో లేక కాయ చెడిపోవటమో జరిగితే విచారించవద్దు. చేసిన పూజా వ్యర్ధం కాదు.

కొబ్బరిగిన్నేలు అందుబాటులో లేనిచో వాటికి బదులుగా చిన్న పాత్రలను మూడింటిని తీసుకోండి. అక్కడా అవకాశం లేక పోతే విడివిడిగా మూడు తమలపాకులను సిద్దం చేసుకోండి.

ఒక్కో రక్షాకవచానికి మూడు పుష్పాలు, 24 శ్లోకాలు కేటాయించబడినవి.
ఈ పుష్పాలను ఒక కొబ్బరి గిన్నెలో వేయబోయి మరొక దానిలో పొరపాటున వేసిననూ దిగులు చెందకండి.
శ్లోకాలను సంఖ్యల ప్రకారం చదువుతూ... అక్షతలను వేసుకుంటూ రండి.

పూజకు వినియోగించే అగరుబత్తీలను వస్త్రాలకు దూరంగా వుంచండి.

ఒకరి తరఫున మరొకరు కూడా ఆచరించవచ్చును. సంకల్పం ముఖ్యము.
పుణ్య స్త్రీలు, వైదవ్య స్త్రీలు, బాలలు, అవివాహితులు, వృద్దులు, పురుషులు (భార్యా వియోగులు కూడా) ఎవరైనను ఆచరించవచ్చును.
పురుడు లేక మరణ అశౌచము వున్నవారు ఆచరించవద్దు.
ఐదవరోజు ఋతుస్నానం వారు కూడా ఆచరించవద్దు.
ఆరవ మాసం ప్రారంభమైన గర్భిణులు వద్దు.
విదేశాలలో వున్న వారి కొరకు ఇక్కడ వారు ఆచరించవచ్చు.

177 వ శ్లోకం చదివి శ్రీ గంధం , కుంకుమ విలేపనం సమర్పయామి అని చెప్పిన తదుపరి అక్షతాన్ సమర్పయామి అనే ఉపచారానికి 21 శ్లోకాలను, 81 నామాలను పఠించాలి.
ఇందులో ముందు శ్లోకాలు, వెనుక నామావళి గాని లేక ముందు నామావళి వెనుక శ్లోకాలను కాని పఠించిననూ సమస్య ఏమి కాదు.
21 పుష్పాలు అనగా... అంతకుముందు ఒక్కో వస్త్రానికి మూడు పుష్పాలు చొప్పున కొబ్బరి గిన్నెలలో వేసుకున్నారు కదా.
ఏడు వస్త్రాలు 21 పుష్పాలు అయినవి. ఈ మొత్తం 21 పుష్పాలు కలుపుకొని ఒక్కో పుష్పంతో, ఒక్కో శ్లోకం చెప్పి కలశపూజ చేయాలి. 

పూజా కార్యక్రమం తరువాత
కలశంలోని నాణెము లేక నాణెములను తీసిన తదుపరి కలశంలోని నీటిని కుటుంభ సభ్యుల శిరస్సుపై చల్లుకొని మిగిలిన నీటిని తులసి చెట్టు, లేక ఇతర మొక్కల మొదళ్ళలో పోయాలి. కలశపూజలో వాడిన అక్షతలను  భద్రపరచుకొని, ప్రతి నిత్యం కార్యాలయాలకు లేక వ్యాపారసంస్థలకు వెళ్లేముందు ఐదు అక్షతలను తల మీద ఉంచుకోవాలి. ఉత్తరభారతంలో అక్షతలను తులసి చెట్టు దగ్గర ఉంచే సాంప్రదాయం ఉన్నది. కనుక వారి వారి సాంప్రదాయాల ప్రకారంగా ఆచరించవచ్చును. రెండు యాలక్కయలను ప్రసాదంగా స్వీకరించవచ్చును.
కలశం పై కొబ్బరి కాయను కొట్టుకొని వృధా కానివ్వకుండా తీపి వంటకాలలో ఉపయోగించుకోవాలి.
కలశం క్రింద ఉంచిన బియ్యాన్ని తర్వాత రోజులలో భోజన పదార్ధంగా వినియోగించుకోనేది. వృధాగా పోనివ్వవద్దు.
బియ్యం క్రింద వ్రుంచిన వస్త్రమును తదుపరి కలశ పూజలలో ఉపయోగించుకోవచ్చు.

ఈ పూజా కార్యక్రమంలో నామావళి, శ్లోకాలు చెప్పే సమయంలో అక్షతలను, పుష్పాలనే వినియోగించేది. కుంకుమార్చన చేయవద్దు.
ఈ రోజే పొట్టు ఉన్న గోధుమపిండి 100 గ్రాములు సిద్దం చేసుకొని ఉంటే, అందులో ఒకే ఒక చెంచా నేతిని వేసి కలిపి ప్యాకెట్ గా భద్రపరుచుకోండి. 
ఒకవేళ గోధుమపిండి లేనివారు దిగువ తేదీల నాటికి సిద్దం చేసుకోండి.

9 కలశపూజలు పూర్తైన తదుపరే ప్రత్యేక పద్దతిలో కుంకుమార్చన చేయాలి. దానికి ప్రత్యేకమైన రోజు ఉంది.
ఆ రోజే 2012
మే 15 మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు, ఆరోజున అవకాశం లేని వారికి మే 17 గురువారం లేదా మే 26 శనివారం.
ఆరోజునే పొట్టు ఉన్న గోధుమపిండి అవసరము. ఈ గోధుమపిండిని ఎలా వినియోగించాలి, కుంకుమార్చన ఎలా చేయాలి అనే వివరాలు పోస్టింగ్ లో ఇవ్వగలను.

ఈ 8 , 9 రక్షాకవచాలను క్రియాత్మకంగా ఉత్తేజపరచుటకు (activation ) సమయము

  • భారతదేశంలో మరియు విదేశాలలో మే 5 వ తేది రాత్రి కనపడే పూర్ణచంద్రుడికి దర్శింపచేయండి. దీనితో పాటు మిగిలిన 7 రక్షాకవచాలను కూడా దర్శింపచేయవచ్చు. 
  • అవకాశం లేనిచో రెండవరోజు శ్రీ సూర్యనారాయణ స్వామికి మధ్యాహ్నం లోపల దర్సింపచేయండి.
  • ఒకసారి ఉత్తేజపరిచిన రక్షాకవచాలను ఎన్నిపర్యాములైననూ ఉత్తేజపరచుకోవచ్చు, లేదా నూతన కవచాన్ని మాత్రమే ఆక్టివేట్ చేసుకోవచ్చు.
  • ఉత్తేజపరిచిన తొమ్మిది రక్షాకవచాలను భద్రంగా ఉంచుకొని, తదుపరి పోస్టింగ్ లో చెప్పిన విధంగా వినియోగించుకొనండి.
తొమ్మిది రక్షాకవచాలను ఒకేసారి పొందుటకు అతిత్వరలోనే ఒక శుభకరమైన రోజు సిద్ధంగా వుంది.

9 రక్షాకవచాలను కూడా పొందుటకు 2012 జూన్ 5 భారతదేశంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆచరించుకోవాలి. విదేశాలలో జూన్ 5 ఉదయం 10 గంటల లోపల ఆచరించుకోవాలి.

2012 జూన్ 5 న ఒకేసారి నా ఆధ్వర్యంలో, నా పర్యవేక్షణలో,  ఆంద్రప్రదేశ్ లో ఓ ప్రత్యేక ప్రాంతంలో ఓంకార మహాశక్తి పీఠం నిర్వహించబోయే కార్యక్రమంలో పాల్గొని ఆచరించుకోండి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.