Wednesday, May 2, 2012

2012 మే 5 నాటి 8 , 9 కలశపూజల వివరాలు - మొదటి పోస్టింగ్

2012 మే 5 శనివారం నాడు 8 మరియు 9 కలశపూజలు ఒకేసారిగా భారతదేశంలో మరియు విదేశాలలో మే 5 సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపల ఆచరించుకోవాలి.

మే 5 శనివారం 8 మరియు 9 కలశపూజలు కలశపూజల వివరాలు
  1. ఇంతవరకు 7 రక్షాకవచాలకు చెందిన 7 కలశపూజలను చెప్పటం జరిగింది.
  2. వరుసగా 1 నుంచి 7 వరకు క్రమం తప్పకుండా చేసుకున్నవారు ఎందరో వున్నారు.
  3. కొంతమంది అనివార్య కారణాలవలన మధ్య మధ్యలో చేస్తున్నవారు ఉన్నారు.
  4. 2012 మే 5 శనివారం నాడు 8 మరియు 9 కలశపూజలు ఒకేసారిగా భారతదేశంలో మరియు విదేశాలలో మే 5 సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపల ఆచరించుకోవాలి.
  5. 5 వ తేది ఉదయం శ్రీ సూర్య భగవానుణ్ణి భక్తితో దర్శించి కలశపూజను ఆచరిస్తున్నామని మనసులోని సంకల్పాన్ని శ్రీ సూర్యగ్రహ సందర్శనం చేస్తూ మనసులోనే ప్రార్దించుకోండి.
  6. ఉదయం నుంచి ఎటువంటి ఆహార నియమములు లేవు.
  7. ఇంతవరకు మీ వద్ద స్వస్తిక్ మార్క్ రుమాలు, 11 పోగుల ఎరుపు దారం సూత్రము, నాణెములు, 16 బిందువులతో కూడిన త్రిభుజ చిత్ర రుమాలు, శ్రీం అనే బీజాక్షరంతో లిఖించిన రుమాలు, హ్రీం అనే బీజక్షరంతో లిఖించిన రుమాలు, ఐం అనే బీజాక్షరంతో ఉన్న రుమాలు ఉన్నవి.
  8. ఇప్పుడు 8 మరియు 9  రక్షాకవచాలను సిద్దం చేసుకోవాలి. 
  9. ఐం బీజాక్షర రుమాలు కంటే నాలుగు వైపులా స్వల్పంగా అర అంగుళం తగ్గుదలతో వుండే మరో పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొనండి. ఈ పసుపు రంగు రుమాలు కంటే నాలుగువైపులా మరో అర అంగుళం తగ్గుదలతో వుండే మరో తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొనండి.
  10. అనగా ఒక పసుపు రంగు గల చతురస్ర రుమాలు 8 వ రక్షాకవచంగా, తెలుపు రంగు గల రుమాలు 9 వ రక్షాకవచంగా ఉండునని భావము.
  11. ఎరుపు కుంకుమను ఆవునేతితో కలిపి పసుపు రంగు గల చతురస్ర రుమాలు మధ్య భాగంలో  'గం' అనే బీజాక్షరాన్నివేసుకోవాలి. ఇది 8 వ రక్షాకవచం.
  12. ఎరుపు కుంకుమను ఆవునేతితో కలిపి తెలుపు రంగు గల చతురస్ర రుమాలు మధ్య భాగంలో  'ఓం' అనే బీజాక్షరాన్నివేసుకోవాలి.ఇది 9 వ రక్షాకవచం.
  13. ఈ 8 మరియు 9 కలశ పూజకు పసుపు లేక తెలుపు లేక ఎరుపు వర్ణ పుష్పాలను వినియోగించండి. అవకాశం ఎట్టి పుష్పాలైనను వినియోగించండి. ప్రాధాన్యత పసుపు వర్ణము.
  14. పసుపు , నెయ్యి కలిపిన అక్షతలు సిద్దం చేసుకోండి. 
  15. మూడు ఎండు కొబ్బరి చిప్పలను (అర గిన్నెలు) తీసుకోవాలి. వీటిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులుగా భావించుకోవాలి.
  16. దీపారాధనకు వాడే తైలము మీ నిర్ణయము.  వత్తుల సంఖ్య, ప్రమిదల సంఖ్య మీ నిర్ణయమే.
  17. కలశం మీద పీచు తీసిన కొప్పులా ఉండే కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయను కుంకుమతో చక్కగా అలంకరించుకోండి.
  18. నివేదనకు బెల్లం లేక పంచదారతో చేసిన పాయసం లేక పొంగలి. (బియ్యము లేక సేమ్యా లేక బియ్యపురవ్వ, గేదెపాలు లేక ఆవుపాలు) కొబ్బరికాయ ఇతర ఫలములు నివేదించటము  మీ ఇష్టానుసారం. 
  19. ఇక పూజకు ఓ పీట, పీట పైన పరిచే ఎరుపు రంగు నూతన వస్త్రము లేక అంతకు ముందు కలశపూజలకు వాడిన వస్త్రమైనను వినియోగించవచ్చు.
  20. వస్త్రం పైన మంచి బియ్యం, పూజకు అగరు బత్తీలు , కర్పూరము మొదలగునవి అవసరము.
  21. కలశంలోని కొబ్బరికాయ క్రింద ఉంచుటకు 5 మామిడాకులు లేక 5 తమలపాకులు అవసరము.
  22. సహజంగా ప్రతి ఇంటిలో పూజలకు వినియోగించుకొనే గంట మొదలగు సామగ్రిని వినియోగించుకోండి.
    పూజా పద్ధతి
    2012 మే 5 శనివారం నాడు 8 , 9 కలశపూజలు ఒకేసారిగా భారతదేశంలో మరియు విదేశాలలో మే 5 సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపల ఆచరించుకోవాలి.
    ఒకరి తరఫున మరొకరు కూడా ఆచరించవచ్చును. సంకల్పం ముఖ్యము.
    పుణ్య స్త్రీలు, వైదవ్య స్త్రీలు, బాలలు, అవివాహితులు, వృద్దులు, పురుషులు (భార్యా వియోగులు కూడా) ఎవరైనను ఆచరించవచ్చును.
    పురుడు లేక మరణ అశౌచము వున్నవారు ఆచరించవద్దు 
    ఆరవ మాసం ప్రారంభమైన గర్భిణులు వద్దు.
    విదేశాలలో వున్న వారి కొరకు ఇక్కడ వారు ఆచరించవచ్చు.

  23. గృహం లోని ఈశాన్య భాగంలో కాని లేక ఈ ఇతర భాగంలో కాని మీరు తూర్పు దిశగా చూసేలా పూజను చేసుకోండి.
  24. ఓ పీట వుంచి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరవండి. దానిపై బియ్యాన్ని పోసి, గుండ్రంగా లేక చదరంగా లేక దీర్ఘ చతురశ్రంగా నెరపండి.
  25. దీపారాధన చేసుకోండి.
  26. తిథి, వార, నక్షత్రాలతో పాటుగా గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకొని పసుపుతో చేసిన గణపతిని బియ్యంపై తమలపాకులలో ఉంచి ప్రార్దించండి.
  27. గణపతికి ధూప, దీపాలను ఇవ్వండి. నైవేద్యంగా బెల్లాన్ని నివేదించండి. అవకాశం ఉన్నవారు గణపతి పూజను పూర్తిగా ఆచరించవచ్చు. 
  28. గణపతి పూజ అనంతరం, గణపతికి ఉద్వాసన చెప్పి పూజా పీటకు ఈశాన్య భాగంలో ఉంచండి.
  29. తదుపరి బియ్యంపైన స్వస్తిక్ మార్క్ రుమాలును వుంచండి. స్వస్తిక్ దిగువన ఉన్న వస్త్రపు కోణము మీ వైపుకు ఉండేలా పెట్టుకోండి.
  30. స్వస్తిక్ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే.  
  31. వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.

స్వస్తిక్ రక్షాకవచ పూజా విధి ( 1 )
  • ముందుగా ఒక పుష్పాన్ని స్వస్తిక్ రక్షాకవచం మధ్యన ఉంచండి.
  • భక్తితో నమస్కరించుకోనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి. 
లలితా సహస్రనామ స్తోత్రంలోని 1 వ శ్లోకాన్ని చదువుతూ 
1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.  
2 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
3 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
4 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
5 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
6 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
7 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
8 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
  • రెండవ పుష్పాన్ని స్వస్తిక్ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
  • దానిని భక్తీతో రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 9 వ శ్లోకాన్ని చదువుతూ 
1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
10 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
11 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
12 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
13 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
14 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
15 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
16 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
  • మూడవ పుష్పాన్ని స్వస్తిక్ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
  • దానిని భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
 లలితా స్తోత్రంలోని  
17 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
18 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
19 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
20 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
21 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
22 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
23 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
24 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
ఇంతటితో స్వస్తిక్ రక్షాకవచ పూజ పూర్తయినది. 
 షోడశబిందు సహిత  త్రిభుజ రక్షాకవచ పూజా విధి (2 )
  • తరువాత స్వస్తిక్ రక్షాకవచంపై షోడశ బిందు సహిత త్రిభుజ వస్త్ర రుమాలును ఉంచండి.
  • వస్త్రంలోని త్రిభుజ కోణము మీ వైపుకు ఉండేలా, స్వస్తిక్ రుమాలు పై వేయండి.
  • షోడశ బిందు సహిత త్రిభుజ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే.  
  •  
  • వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.
  • ముందుగా ఒక పుష్పాన్ని షోడశ బిందు సహిత త్రిభుజ రక్షాకవచం మధ్యన ఉంచండి.
  • భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
    లలితా సహస్రనామ స్తోత్రంలోని 25 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.  
    26 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్యదగ్గర అక్షతలు వేయాలి.
    27 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    28 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    29 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    30 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    31 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    32 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
  • రెండవ పుష్పాన్ని షోడశ బిందు సహిత త్రిభుజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
  • దానిని భక్తీతో రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
    లలితా సహస్రనామ స్తోత్రంలోని 33 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    34 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    35 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    36 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    37 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్యదగ్గర అక్షతలు వేయాలి.
    38 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    39 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    40 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    • మూడవ పుష్పాన్ని స్వస్తిక్ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
    • దానిని భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
    • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
    లలితా సహస్రనామ స్తోత్రంలోని 41 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    42 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    43 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    44 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    45 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    46 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    47 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    48 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    • ఇంతటితో షోడశ బిందు రక్షాకవచ పూజ పూర్తయినది.  
    • గమనిక : పాఠకులు దయచేసి తికమక పడకుండా జాగ్రత్తగా అర్థం  చేసుకొనగలరని ఆశిస్తాను.
    • రెండవ పోస్టింగ్ లో మిగిలిన వివరాలు కొద్ది గంటలలోనే పొందుపరుస్తాను.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.