Sunday, March 4, 2012

2012 మార్చ్ 12,14 తేదీలలో కలశపూజలు ఎవరెవరు ఆచరించవచ్చును ?


ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఎంతో అభిమానంతో, భక్తితో , విశ్వాసంతో మార్చ్ 4 నాటి కలశపూజలు చేసుకున్నందుకు చాలా సంతోషం. అయితే ఇప్పటికి అనేక మందికి సందేహాలు వస్తూనే వుంటాయి. ఇక 2012  మార్చ్ 12 వ తేది సోమవారం నాడు తిరిగి మార్చ్ 14 బుధవారం నాడు కలశ పూజలు ఆచరించుటకు అనువైన గ్రహ స్థితులు వున్న రోజులు. అయితే మార్చ్ 12 సోమవారం నాడు ఎవరెవరు ఆచరించుకోవాలి ? మార్చ్ 14 వ తేదిన ఎవరెవరు ఆచరించుకోవాలి అనే వివరాలను ఈ దిగువన తెలియచేస్తున్నాను. 

టీవీ కార్యక్రమంలో ఒక్కోసారి సమయం లేని కారణంగాను, ఇతర సాంకేతిక కారణాలవలన, కార్యక్రమ నిడివి తగ్గుతున్న కారణంగాను, లక్షలాది మంది ప్రేక్షకులందరికీ తగిన సమయంలో నేను చెప్పలేక పోతున్నందుకు చాలా విచారిస్తున్నాను. కనుక అందరికి అర్థమయ్యేలాగా వివరంగా ఇవ్వాలనే సంకల్పంతో, తెలుగు లో అన్ని విషయాలను తెలియచేస్తున్నాను. మీ అందరి ఆదరాభిమానాలు నా యందు వుండాలని మనసారా కోరుకుంటున్నాను. 

మామూలుగా నిత్యం ఫోన్ ద్వారా టీవిలో సమాధానాలు చెప్పటానికి, విశ్వవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వుండే వారికి రాశిఫలితాలలో స్వల్ప వ్యత్యాసాలతో సహా చెప్పటానికి, ఇటువంటి కలశ పూజల అద్భుత విశేషాలను మీ ముందుకు తేవటానికి, కొన్ని కొన్ని ఉత్తరాలను చదవటానికి, కొన్ని ముఖ్య ముహూర్తాలను, ఇతర అనేక అద్భుత గ్రహ సంచార స్థితులను తెలియచేయాలంటే, అరగంట టీవీ ప్రోగ్రాం సమయం చాలటం లేదు. వాణిజ్య సంభందిత కార్యక్రమాలకు అవకాశం వుంటుంది గాని, ఉచితంగా ప్రేక్షకులకు తెలియచేయటానికి సమయం పెంచలేక పోతున్నారు.

ఇటువంటి పరిస్థితిలో లక్షలాది ప్రేక్షకుల కోరిక మేరకు కొన్ని కొన్ని విశేషాలను ఇట్టి బ్లాగుల ద్వారా చెప్పటానికి అవకాసం వుంది. ఎన్నిసార్లైనా చదివి, ఆకళింపు చేసుకొనే అవకాశం వుంది. వీలైనంతవరకు తెలుసుకున్న వారు, ఇతరులకు తెలియచెప్పటానికి ప్రయత్నించండి. వేదవాణి అందించిన రహస్యాల విశేష అంశాలన్నింటిని మనందరం తెలుసుకుంటుంటే ఆనందం ఏంటో వుంటుంది. ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం.  

టీవీ చూసిన ప్రేక్షకులలో కొన్ని కలశ పూజలు ఆచరించిన తక్షణమే అద్భుతాలను కూడా చవిచూడటం జరిగినది. కానీ ఇంతవరకు చెప్పిన 5 కలశ పూజలలో కొంతమంది కొన్నింటిని ఆచరించారు. మరికొన్నింటిని ఆచరించలేకపోయారు. ఈ పరంపరలో 2012 మార్చి 4  వ తేదీ ఆదివారం అనగా ఈరోజు వరుసగా 3 కలశ పూజలు ఆచరించారు.
 
మార్చి 12 వ తేదీ సోమవారం ఎవరెవరు ఆచరించవచ్చు  :
A .
2011 అక్టోబర్ 25 న 11 దారపు పోగుల సూత్రంతో కలశపూజ చేసి, 3 , 4 కలశపూజలు చేయని వారు ఆచరించవచ్చును.
B . ఇంత వరకు ఎటువంటి పూజలు ఆచరించని వారు 1 , 2 , 3 , 4  కలశ పూజలు ఆచరించవచ్చును.   
అలాగే మార్చి 14 వ తేదీ బుధవారం ఎవరెవరు ఆచరించవచ్చు  :
కేవలం నాల్గవ కలశ పూజ ఆచరించుటకు అవకాశం ఉంది.
 

కనుక త్వరలోనే మార్చ్ 12 న కేవలం మూడు, నాల్గు కలశపూజలు ఎలా చేయాలి వివరంగానూ, అలాగే 1 , 2 , 3 , 4  కలశ పూజలు ఎలా చేయాలి అనే వివరాలు కూడా తెలియచేస్తాను. దయచేసి సావధాన  చిత్తులై చదవగలరని ఆశిస్తున్నాను. ఇతర దేశాలలో ఉన్న వారికి మార్చ్ 12 , 14 తేదిలలో ఏ ఏ సమయాలలో ఆచరించాలి, భారతదేశంలో ఉన్న వారు ఏ సమయంలో ఆచరించాలి తెలియచేస్తాను.  

దీనితో పాటు ఈ రోజు ఆచరించిన కలశ పూజల వారు తమ తమ రక్షాకవచాలను ఏ తేదిన ఏ సమయంలో activate  ( క్రియాత్మకముగా ఉత్తేజపరుచు) చేసుకోవాలో, సమయలన్నింటిని తెలియచేస్తాను. కనుక మార్చ్ 4 నాటి రక్షా కవచాలను భద్రంగా ఓ పెట్టెలో గాని, బీరువాలోగాని వుంచుకోగాలరని, తదుపరి ఇచ్చే activation వివరాల కోసం ఎదురు చూడగలరని ఆశిస్తున్నాను.

- పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.